Skip to main content

Abhinav sai: అబ్బురపరుస్తున్న అభినవ్ అమోఘ జ్ఞాపక శక్తి

ఆ చిన్నారి వయసు కేవలం 19 నెలలు. కానీ అతని అమోఘమైన జ్ఞాపకశక్తిని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.
Abhinav Sai
అభినవ్ సాయి

ఇప్పుడిప్పుడే అడుగులో అడుగులు వేస్తూ..ఇంకా మాటలు కూడా రాని ఆ చిన్నారి దేనినైనా ఠక్కున గుర్తుపట్టే సామర్థ్యాన్ని మాత్రం సొంతం చేసుకున్నాడు. నెలల వయసులోనే ఈ ఘనత సాధించి India Book of Recordsలో స్థానం సంపాదించిన ఆ చిన్నారి పేరు Abhinav Sai. కాకినాడకు చెందిన Lalitha Mythili – Umashankar కుమారుడైన Abhinav ఏదైనా ఒక్కసారి చూస్తే అది మైండ్‌లో ఫిక్స్‌ కావాల్సిందే. అలాంటి జ్ఞాపక శక్తిని సంపాదించిన ఈ బుడతడు పలు దేశాల జెండాలు, దేశ నాయకులు, పక్షులు, జంతువులు, ఇళ్ళల్లో వినియోగించే వస్తువులు సహా దేనినైనా ఠక్కున గుర్తుపట్టేస్తున్నాడు. అతని ఎదురుగా దాదాపు 200 వరకు జెండాలు, వస్తువులు, పక్షుల బొమ్మలను పెట్టి ఏ పేరు చెబితే ఆ బొమ్మను వెంటనే తడుముకోకుండా చేతితో తీసి మరీ చెప్పేస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఉన్న Lalitha Mythili – Umashankar స్వస్థలం Kakinada కావడంతో చిన్నారి మొదటి పుట్టినరోజు కోసం కాకినాడ వచ్చారు. ఆ సమయంలో ఇతని ప్రతిభ చూసిన తాతయ్య, Smart City Command and Control Center మేనేజర్‌ వీఎస్‌ఆర్‌ మూర్తి ఆ ప్రతిభను గుర్తించి India Book of Records దృష్టికి తీసుకువెళ్ళారు. ఆ తరువాత ఆ చిన్నారి మేధాశక్తిని పరిశీలించాక India Book of Records సంస్థ గోల్డ్‌మెడల్, సర్టిఫికెట్, ఐడీ కార్డు, పెన్, స్టిక్కర్స్‌ Kakinadaకు పంపింది. వాటిని జూన్‌ 21న సిటీ ఎమ్మెల్యే Dwarampudi Chandrasekhar Reddy చేతుల మీదుగా ఆ చిన్నారికి అందజేశారు.

చదవండి: 

Published date : 22 Jun 2022 03:52PM

Photo Stories