Tenth Class: పశ్చిమ గోదావరి జిల్లా బాలికకు అత్యధిక మార్కులు
![Tenth Class](/sites/default/files/images/2022/06/07/tenthtoppers-1654596269.jpg)
మొత్తం 600 మార్కులకుగాను ఈ జిల్లాకు చెందిన చిట్టాల హరిసాత్వికకు (హాల్ టికెట్ నంబర్ (2211117813) 598 మార్కులు లభించాయి. గుంటూరు–1, విశాఖపట్నం–1, అనంతపురం–2 జిల్లాలకు చెందిన యాటగిరి చిన్న సాయినిఖిలానా, వెల్లం కీర్తిరెడ్డి, చిటిమిరెడ్డి వర్షితలకు 596 చొప్పున మార్కులు వచ్చాయి. ఇక 11 మందికి 595 మార్కులు, 21 మందికి 594 మార్కులు వచ్చాయి.
చదవండి: ఏపీ పదో తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి
బాపట్ల విద్యార్థినికి 596 మార్కులు
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సోమవారం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల బెస్తపాలెంకు చెందిన యాటగిరి చిన్నసాయి నిఖిలానా 596/600 మార్కులు, భీమావారిపాలెంకు చెందిన ఎ.తేజశ్రీ 594/600 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో నిలిచారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. సివిల్స్‌లో రాణించాలన్నదే తన ధ్యేయమని వై.చిన్నసాయి నిఖిలానా తెలిపింది.