Skip to main content

Andhra Pradesh: మరో దారి లేక‌నే ఇలా.. సీఎం జ‌గ‌న్ సంత‌కంతో మారిన దారి..

నలిగిపోయి, మాసిపోయిన షర్ట్‌.. ప్యాంటో లేక షార్టో తెలియని బాటమ్‌.. పాత సైకిల్‌పై ఓ సంచిలో బనియన్లు, డ్రాయర్లు, చొక్కాలు పెట్టుకుని.. పాతపట్నం, కొరసవాడ, కాగువాడ గ్రామాల్లో అమ్ముతూ జీవిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు.
కేదారేశ్వరరావు, 1998 డీఎస్సీ  బ్యాచ్‌
కేదారేశ్వరరావు, 1998 డీఎస్సీ బ్యాచ్‌

బేరం లేని రోజు పస్తు పడుకోవడం తప్ప మరో దారి లేని ఇతను ఇలా రెండు దశాబ్దాలుగా జీవితం లాక్కొస్తున్నాడు. 

ఈ వయసులో..
అరకొర ఆదాయం వల్ల పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లిదండ్రులు అల్లక నీలకంఠు, అమ్మయమ్మలు మృతి చెందారు. ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడే ఇతను 1998 బ్యాచ్‌ డీఎస్సీకి అర్హత సాధించారు. అయితే వివిధ కారణాల వల్ల అప్పట్లో ఉద్యోగం రాలేదు. తాజాగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో ఆ బ్యాచ్‌లో మిగిలి పోయిన అర్హులకు ఉద్యోగాలొచ్చాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు కేదారేశ్వరరావు చెవిన వేయగా, ఆయన ఆశ్చర్యపోయాడు. చంద్రబాబు ఇవ్వలేదు.. జగన్‌ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇతని వయసు 57 ఏళ్లు. ఈ వయసులో ఇతని జీవితం ఇలా మేలి మలుపు తిరగడం పట్ల స్థానికులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP TET Notification : ఏపీ టెట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ నిబంధనల ప్రకారమే..?

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్దులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. అభ్యర్థులందరికీ న్యాయం చేసే ఫైల్ మీద సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు. ఈ మేరకు వారికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇరవై ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉంది. ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదు. సీఎం జగన్‌ న్యాయం చేస్తారని నమ్మి వాళ్ళు విన్నవించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

AP TET 2022 : టెట్‌ను సులువుగా కొట్టే స‌రైన‌ మార్గాలు ఇవే..|బెస్ట్ బుక్స్ ఇవే..|సిల‌బ‌స్ ఇదే..

తాజా నిర్ణయంతో..
గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 98, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగలేదు. 2008 డీఎస్సీ అభ్యర్థుకుల  కూడా సీఎం జగన్‌ న్యాయం చేశారు. తాజా నిర్ణయంతో 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుంది.

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

Published date : 20 Jun 2022 01:46PM

Photo Stories