Admissions: ఓపెన్ వర్సిటీలో ప్రవేశానికి గడువు పెంపు
ఇంటర్, డిప్లొమా, రెండేళ్ల ఐటీఐ కోర్సు, నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సీనియర్ ఇంటర్ పూర్తయిన విద్యార్థులందరూ ఓపెన్ డిగ్రీలో చేరేందుకు అర్హులన్నారు. ఐటీఐ(రెండేళ్ల కోర్సు) పూర్తి చేసినవారికి రెగ్యులర్‌గా డిగ్రీ చదివే అవకాశం లేదని, కానీ ఓపెన్ యూనివర్సిటీ ఆ అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చదవండి: Distance Education: ఓపెన్ ఇంటర్‌కేంద్రం
ఎంబీఏలో చేరేందుకు 20లోగా దరఖాస్తు చేసుకోండి
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంబీఏలో ప్రవేశం పొందేందుకు ఆసక్తి గలవారు ఆగస్టు 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐసెట్ రాయని, రాసినా ఉత్తీర్ణులు కానీ అభ్యర్థుల కోసం యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు పభుత్వ డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ కేంద్రం లేదా 73829 29654 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.