BRAOU: ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు చివరి తేదీ ఇదే
Sakshi Education
పాడేరు : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు జనవరి 31 వరకు గడువు ఉందని పాడేరు అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ మురళీధరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
![Important Update Admissions Open for First-Year Degree at Dr. BR Ambedkar Open University deadline for Open University admissions is 31st Dr. BR Ambedkar Open University Admission Deadline](/sites/default/files/images/2024/07/25/counselling-1721893689.jpg)
అడ్మిషన్ల ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలని సూచించారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందుపర్చి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యయన కేంద్రంలో వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్ ఫీజు కూడా ఆన్‌న్‌లైన్‌లో చెల్లించాలని కోరారు.
చదవండి: Admissions: ప్రతిభ కళాశాలల ప్రవేశం నోటిఫికేషన్ విడుదల
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఈనెల 15వరకు గడువు ఉందన్నారు. పూర్తి వివరాలకు 9490458695, 7382929728 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Published date : 12 Jan 2024 11:23AM