Admissions: ప్రతిభ కళాశాలల ప్రవేశం నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని 38 ప్రతిభ గురుకుల కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 15వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కళాశాలల్లో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్, క్లాట్, సీఎంఏ వంటి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ అందిస్తారని తెలిపారు.
చదవండి: Law Admissions: మహిళా ‘లా’ గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు స్టడీ మెటీరియల్ అందిస్తారని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.