Law Admissions: మహిళా ‘లా’ గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలోని కాజీపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ గురుకుల మహిళా లా(న్యాయ కళాశాల) కళాశాలలో 2023–2024 విద్యాసంవత్సరంలో ఐదేళ్ల లా, ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో జనవరి 10 వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్‌సీఓ మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
2023 లాసెట్‌లో ఉత్తీర్ణులై ఇంటర్ పూర్తిచేసుకున్న మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. లాసెట్ ప్రాసెసింగ్ ఫీజు రూ.800 , ఎస్సీ, ఎస్టీలకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
చదవండి: District Legal Service Authority: చట్టాలపై విద్యార్థులుఅవగాహన పెంచుకోవాలి
అర్హత పత్రాలతోపాటు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అడ్మిషన్లు పొందిన వారు గురుకులంలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. అడ్మిషన్ల సమాచారం కోసం 99088 48929, 93966 00601, 98495 85458 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Published date : 10 Jan 2024 12:29PM