Skip to main content

District Legal Service Authority: చట్టాలపై విద్యార్థులుఅవగాహన పెంచుకోవాలి

పాలమూరు: సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులు పరిరక్షించాలని, హక్కులకు భంగం కలగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి అన్నారు.
Students should be aware of laws

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబ‌ర్ 20న‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో మాట్లాడారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

చదవండి: Balasubramanian Menon: గిన్నిస్‌ రికార్డు సాధించిన కేరళ న్యాయవాది

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్‌లో మంచి రంగాల్లో రాణించాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ పుట్టపాగ రఘుపతి, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, న్యాయవాదులు సతీష్‌, యోగేశ్వర్‌ రాజ్‌యాదవ్‌, మల్లారెడ్డి, పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ నాగరాజు పాల్గొన్నారు.

Published date : 21 Dec 2023 03:26PM

Photo Stories