UPSC Top ranker Jagruthi Success Story : కోవిడ్‌ను కూడా లెక్కచేయకుండా చదివా.. సివిల్స్‌లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ కొట్టానిలా..
అందుకే ఆమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పై దృష్టి సారించారు. మొదటి ప్రయత్నంలో ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. దీంతో.. రెండో సారి మరింత పట్టుదలగా ప్రయత్నించి.. ఏకంగా యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాంధించారు. ఆమె పేరే జాగృతి అవస్తి. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ స్టోరీ మీకోసం..
IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివరికి ఐఏఎస్ కొట్టానిలా..
కుటుంబ నేపథ్యం :
జాగృతి.. జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్. ఈమె తండ్రి సురేష్ చంద్ర. ఈయన ప్రొఫెసర్. తల్లి విజయ గృహిణి. సోదరుడు డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఎడ్యుకేషన్ :
జాగృతి ప్రాథమిక విద్యను భోపాల్‌లోని రతన్‌పూర్ మహర్షి విద్యా మందిర్ పూర్తి చేసింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తన బీటెక్‌నూ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఉండేది. బీటెక్ తర్వాత బీహెచ్‌సీఎస్ (BHEL)లో ఉద్యోగం చేసింది.
☛➤ IPS Anjali Success Story : అంజలి విశ్వకర్మ.. ఐపీఎస్ సక్సెస్ స్టోరీ.. నా వెనుక ఉన్నది వీళ్లే..
ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేశానంటే..
2019లో ఈ ఉద్యోగాన్ని వదలి.. సామాజిక పనికి సంబంధించిన ఉద్యోగం చేయాలనే ఆలోచన ఈమె మనసులోకి వచ్చింది. అనుకున్న వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి.. యూపీఎస్సీకి సిద్ధమవడం ప్రారంభించారు. కార్మికులకు, మహిళలకు ఏదైనా సేవ చేయాలని ఆమెకు ఎప్పుడూ అనిపించేందట. అందుకే.. యూపీఎస్సీ మీద దృష్టి పెట్టారు. అనుకున్నట్టుగానే.. ఐపీఎస్ అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు.
యూపీఎస్సీ సివిల్స్‌పై పోరాటం ఇలా..
జాగృతి.. యూపీఎస్సీ సివిల్స్ 2020 ఫలితాల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు సాధించింది. అయితే.. మొదటి ప్రయత్నంలో ఆమె విఫలయ్యారు. రెండో ప్రయత్నంలో మాత్రం తాను అనుకున్నట్టే సక్సెస్ అయ్యారు. ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ముందుగా ఈ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ముందు అర్థం చేసుకుందట. వాటి కోసం కొత్తగా బుక్ ప్రిపేర్ చేసుకుంది. మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేశారు. తనకు తానే చాలా సార్లు పరీక్ష పెట్టుకున్నారు.
➤☛ Inspirational Success Story : నిజంగా.. ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీరు పెట్టిస్తోంది..
సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించిన తొలి రోజుల్లో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు చదివేది. ఆ సమయాన్ని కాస్త పెంచింది. తర్వాత 10 నుంచి 12 గంటల పాటు పుస్తకాలకే సమయం కేటాయించింది. మెయిన్స్ ఎగ్జామ్స్‌కు రెండు నెలల ముందు నుంచి రోజుకు 12 నుంచి 14 గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టి.. ప్రతి అక్షరాన్ని ఒడిసిపట్టింది. అలా సమయాన్ని ఎక్కడా వృథా చేయకుండా.. నిరంతరం పుస్తకాలతో మమేకమైన జాగృతి. ఈమె సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ సోషియాలజీ. తొలి ప్రయత్నంలో మంచి మార్కులు సాధించడలేదని తీవ్ర నిరాశకు గురయ్యేదట. కానీ.. అలా అనిపించిన రోజు మరో గంట ఎక్కువగా చదవడానికి ప్రయత్నించేదట. ప్రతికూలతను తట్టుకుని మరింత ఎక్కువ ప్రయత్నం చేశానని ఆమె చెప్పారు. కలెక్టర్ అవ్వాలని చిన్నప్పుడు కన్న కలలను.. కఠోరంగా శ్రమించి నిజం చేసుకున్నాను అని ఉప్పొంగిన సంతోషంతో ఆమె తెలిపింది.
☛ IPS Success Story : నన్ను విమర్శించిన వారే.. ఇప్పుడు తలదించుకునేలా చేశానిలా..
కోవిడ్ సమయంలో కూడా..
కోవిడ్ మహమ్మారి సమయాన్ని కూడా ఆమె చదువు కోసం కేటాయించారు. ఒకవైపు ఈమె కోవిడ్ బారిన పడినా కూడా.. ఎక్కడ తగ్గకుండా..తన ప్రిపరేషన్‌ను కొనసాగించారు.
ఆ సమయంలో చేతిలో..
ఏదో ఒకటి సాధించాలనే తపన నాకు చిన్నతనం నుంచే ఉండేదన్నారు. ఉద్యోగం చేయాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అయితే.. కరోనా సమయంలో ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది. ఆ సమయంలో ఆదాయం లేక ఇబ్బందిపడిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. ఉద్యోగం వదిలేయకుండా ఉండాల్సిందని చాలా సార్లు బాధపడ్డారు.
నా సక్సెస్‌లో కీలక పాత్ర వీరిదే..
తన విజయంలో పూర్తి క్రెడిట్ తన కుటుంబానికి ఇచ్చేశారు. తన తల్లిదండ్రులు, స్నేహితులు తన కోసం ఎంతో కష్టపడ్డారని ఆమె చెప్పారు. ఈ యూపీఎస్సీ పరీక్ష కోసం దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇంట్లో టీవీ లేదని ఆమె చెప్పారు. టీవీ ఉంటే.. దానిని చూస్తే సమయం వృథా చేస్తాననే భయంతో టీవీ కూడా తీసేశామని ఆమె చెప్పారు.
☛ IPS Success Story : ఇంట్లో చెప్పకుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..