Success Story: ఈ కసే.. నన్ను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేలా చేసిందిలా..
తొలి రెండు ప్రయత్నాల్లో దక్కకున్నా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో ప్రిపేర్ అయి తన ఆశయమైన ఐపీఎస్ సాధించారు కొమ్మిప్రతాప్ శివకిశోర్. శిక్షణలో భాగంగా మొదటిసారిగా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు కేటాయించారు. ఈ యువ ఐపీఎస్‌పై ప్రత్యేక కథనం
కుటుంబ నేపథ్యం :
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కొమ్మి నారాయణ, నిర్మలకు ఉదయ్ ప్రశాంతి, కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సంతానం. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా తల్లి గృహిణి. వీరు కుమారుడు కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌కు ఐపీఎస్‌పై ఆసక్తి ఉందని తెలుసుకుని చిన్నప్పటి నుంచి చదువులో ప్రోత్సహించారు.
ఎడ్యుకేషన్..
ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిశోర్ 1 నుంచి 8 వరకు నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చంచులూరు జెడ్పీ పాఠశాలలో చదివారు. 9, 10 జవహర్ నవోదయ విద్యాలయంలో చదవగా, ఇంటర్మీడియెట్ నారాయణ కాలేజీలో పూర్తి చేశారు. 2015లో ఖరగ్‌పూర్ ఐఐటీలో చేరి ఇంజినీరింగ్ చదివారు.
ఈ కసితోనే..
బెంగళూరులోని బాసే సెంట్రల్ ఆర్ట్‌మీ ఇంటెలిజెన్సీలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2016, 2017 సంవత్సరాల్లో రెండు సార్లు సివిల్స్ పరీక్షలు రాశారు. మంచి ర్యాంక్ రాకపోవడంతో 2018లో మరింత కసితో ప్రిపేర్ అయి అనుకున్న లక్ష్యాన్ని సాధించి హైదరాబాద్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అకాడెమీలో శిక్షణ తీసుకున్నారు.
ప్రజలకు పోలీసులపై..
ప్రతి పిల్లవాడికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. దానిని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఎమ్మిగనూరు ప్రజలకు పోలీసులపై ఒక రకమైన అభిప్రాయం ఉంది. వారిలో తెలియని ఆ భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. స్టేషన్‌కు వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..