IPS Success Story : మూడుసార్లు ఫెయిలైన.. నా లక్ష్యాన్ని మాత్రం అపలేదు.. కారణం ఇదే..
మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలమేననడానికి మరోమారు ఉదాహరణగా నిలిచారు యువ ఐపీఎస్ అధికారిని అంకిత సురాన. సమాజంలో అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపిక కావడమే కాదు.. ట్రైనింగ్‌లోనూ ఈ యువ ఐపీఎస్ మంచి ప్రతిభను చూపారు. ఈ నేపథ్యంలో యువ ఐపీఎస్ ఆఫీసర్ అంకిత సురాన సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. కానీ మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నాన్న బిజినెస్‌లో ఉన్నారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. అలాగే మా కుటుంబంలో చాలా మంది బిజినెస్‌లోనే ఉన్నారు. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఎడ్యుకేషన్ :
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి బీఎస్సీ బయో కెమిస్ట్రీ పూర్తి చేశాను. కానీ, నాకు మాత్రం ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో ఉండాలని కోరిక .. అందుకే నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా.
☛ ఇక్కడ ఐపీఎస్‌లకు ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే..?
పట్టిన పట్టు వదలకుండా.. చదివానిలా..
డిగ్రీ చదువుతూనే.. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపై స్థిరంగా ఉన్నాను.. అందుకే మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాల్గో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. నేను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యాను.
☛ IPS Success Story : ఇంట్లో చెప్పకుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
ఒక ఐపీఎస్ అధికారిగా నా లక్ష్యం ఒక్కటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి విన్నాను. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో జిల్లాల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నా. ఒక ఐపీఎస్ అధికారిగా నా లక్ష్యం ఒక్కటే .. నేను ఎక్కడ పనిచేసినా అక్కడ ప్రజలు భద్రంగా ఉన్నామన్న భావన కల్పించడం.. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయడం.
IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివరికి ఐఏఎస్ కొట్టానిలా..