Success Story: అప్పులు చేసి ఐపీఎస్ చదివించారు.. కానీ..
నా పేరు జోయల్ డేవిస్. నేను ఐపీఎస్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాను. మాది తమిళనాడు రాష్ట్రం, జిల్లా కన్యాకుమారి గ్రామం కొట్టికోడు. వ్యవసాయ కుంటుంబం. మా అమ్మానాన్నలు డేవిడ్‌సన్, రీబీలు నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. అప్పులు చేసి మరీ నన్ను ఐపీఎస్ చదివించారు.
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..
ఓ ప్రైవేట్ కంపెనీలో..
డిగ్రీ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. డిగ్రీ చదివే సమయంలో ఉదయం, మధ్యాహ్నం మాకున్న అరటితోటలో నావంతుగా పనిచేసేవాన్ని. డిగ్రీ తర్వాత 8 నెలలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. అసలు నేను ఐపీఎస్ చదువుతానని అనుకోలేదు.
ఈ విషయాన్ని నాకు తెలియనీయకుండా చదివించారు..
అప్పటి వరకు మా గ్రామానికే పరిమితమైన నన్ను మా బావ డిస్పన్‌రాయ్ (ప్రధానోపాధ్యాయుడు) ఐపీఎస్ చదివేంచేందుకు సహాయపడ్డారు. ఆ తర్వాత చెన్నైలో మా అక్కాబావ ఇంట్లో ఉండి ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. చెన్నైలోని అకాడమిక్ ప్రభా ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. 8 గంటలు నిర్విరామంగా చదివేవాన్ని. ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా నా చదువుకు ఆటంకం రావొద్దని మా కుటుంబ సభ్యులు ఆ విషయం నాకు తెలియనీయకుండా దాచేవారు. అప్పు చేస్తూ చదివిస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఐపీఎస్ అవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాను.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..
వీరి ప్రోత్సాహంతో..
2010లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. ఐపీఎస్‌కు ఎంపిక కావడంపై మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వలేదనే సంతోషం కూడా నాలో కలిగింది. ఒక అర్థవంతమైన జీవితం లభించిందనుకున్నాను. నన్ను ప్రోత్సహించిన మా నాన్న, బావ, మా కోచింగ్ సెంటర్ డెరైక్టర్ ప్రభాకర్‌లో ప్రోత్సాహం చాలా వరకు ఉంది. మొదటగా వరంగల్‌లోని జనగంలో ఏఎస్పీగా, ఆ తర్వాత ఉట్నూర్, ఆదిలాబాద్ ఏఎస్పీగా విధులు నిర్వర్తించాను. అలాగే హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా కుడా విధులను నిర్వర్తించాను.
Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.. ఐపీఎస్ అయ్యానిలా..