IAS & IPS: దేశంలో ఇన్ని ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీ
Sakshi Education
2022 జనవరి నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 1,472 IAS పోస్టులు, 864 IPS పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
అధికారుల కొరతను అధిగమించేందుకు బస్వాన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నట్లు ఆగస్టు 4న రాజ్యసభకు లిఖితపూర్వకంగా చెప్పారు. Civils ద్వారా ఏటా ఎంపిక చేసుకునే IPSల సంఖ్యను 2020 సివిల్స్ పరీక్ష నుంచి 200కి, IAS అధికారుల సంఖ్యను ప్రభుత్వం 2012 నుంచి 180కి పెంచిందని వివరించారు. అంతకు మించి తీసుకుంటే నాణ్యతతో రాజీపడినట్లు అవుతుందని కూడా బస్వాన్ కమిటీ తెలిపిందన్నారు. ప్రమోషన్ కోటాలో ఖాళీలను భర్తీ చేసేందుకు UPSC అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమవుతున్నట్లు మంత్రి వివరించారు.
చదవండి:
Published date : 05 Aug 2022 01:49PM