సివిల్ సర్వీసెస్–2020 ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8 ఐఏఎస్ పోస్టులను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) భర్తీ చేయనుంది.
ఐఏఎస్ పోస్టులు భర్తీ చేయనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా మొత్తం 180 ఖాళీలను భర్తీ చేయనున్న డీవోపీటీ ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 7 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 8 ఖాళీలకు గాను ముగ్గురిని సొంత రాష్ట్రం నుంచి, ఐదుగురిని ఇతర రాష్ట్రాల నుంచి భర్తీ చేయనుంది. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి నలుగురు, ఓబీసీ కేటగిరీ నుంచి ఒకరు, ఎస్సీ కేటగిరీ నుంచి ఇద్దరు, ఎస్టీ కేటగిరీ నుంచి ఒకరిని కేటాయించారు.