Skip to main content

సివిల్స్ ప్రిలిమ్స్ -2013 విశ్లేషణ

మే 26న సివిల్ సర్వీసెస్-2013 ప్రిలిమనరీ పరీక్ష దేశ వ్యాప్తంగా జరిగింది. రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్టణం, తిరుపతిలో పరీక్ష నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 21,860 మంది హాజరుకాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 21,660 మంది హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష ఏ విధంగా ఉంది? సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు ఎన్ని వచ్చాయి? వాటి క్లిష్టత ఎలా ఉంది? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణ...

సివిల్స్-2013 ప్రిలిమ్స్‌లో కరెంటు అఫైర్స్, స్టాండర్డ్ జీకేలకు ప్రాధాన్యం బాగా తగ్గింది. ఈ విభాగాల నుంచి ఒకట్రెండు ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. చాలా ప్రశ్నలు పెద్దవిగా ఉన్నాయి. పూర్తిగా చదివి వివిధ కోణాల్లో ఆలోచిస్తే తప్ప సమాధానాలు గుర్తించలేం. మొత్తంమీద చూస్తే పేపర్-1 గతంతో పోలిస్తే తేలిగ్గా ఉంది. పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో రీడింగ్ కాంప్రెహెన్షన్ పరిధిని తగ్గించి బేసిక్ న్యూమరసీ విభాగం ప్రశ్నలు పెంచారు. మొత్తంగా ఈ పేపర్ మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు.

పేపర్-1
ప్రశ్నలు: 100 మార్కులు: 200


పాలిటీ
2011, 2012 సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-1తో పోలిస్తే ఈసారి పాలిటీ విభాగం నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చాయి. ఈ సబ్జెక్టు నుంచి 19 ప్రశ్నలు అడిగారు. మొత్తం మీద ఈ విభాగంలో ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని చెప్పొచ్చు.

Ex: Which of the following bodies does not/ do not find mention in the Constitution?
 1. National Development Council
 2. Planning Commission
 3. Zonal Councils
Select the correct answer using the codes given below.
 a) 1 and 2 only    b) 2 only      c) 1 and 3 only       d) 1, 2 and 3

జవాబు: d

పాలిటీ విభాగంలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి.
Ex: Consider the following statements:
 Attorney General of India can
 1. take part in the proceedings of the Lok Sabha
 2. be a member of a committee of the Lok Sabha
 3. speak in the Lok Sabha
 4. vote in the Lok Sabha
Which of the statements given above is/are correct ?
 a) 1 only     b) 2 and 4    c) 1, 2, 3    d) 1 and 3 only

జవాబు: d

నిర్భయ చట్టం, అవినీతి కుంభకోణాలు తదితర సమకాలీన అంశాలపై ప్రశ్నలు రాకపోవడం నిరాశపరిచే అంశం.
 పాలిటీ అంటే అందరి దృష్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌పైనే ఉంటుంది. వాటిపై తప్పకుండా ప్రశ్నలు వస్తాయని అభ్యర్థులు భావిస్తారు. అయితే ఈసారి ఆర్టికల్స్‌పై ప్రశ్నలు రాలేదు.

జాగ్రఫీ
గతంలో కంటే ఈసారి జాగ్రఫీ, పర్యావరణం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ విభాగాల నుంచి 27 ప్రశ్నలు అడిగారు. వర్తమాన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రాలేదు. బేసిక్స్ అంశాలపై కచ్చితమైన అవగాహన ఉన్నవారు, లాంగ్‌టెర్మ్ ప్రిపరేషన్ ఉన్నవారు మాత్రమే సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి.

Ex: The Narmada river flows to the west, while most other large penin-sular rivers flow to the east. Why?
 1. It occupies a linear rift valley.
 2. It flows between the Vindhyas and the Satpuras.
 3. The land slopes to the west from Central India.
Select the correct answer using the codes given below..
 a) 1 only     b) 2 and 3     c) 1 and 3 d) none

జవాబు: a

ఈ ఏడాది వచ్చిన ప్రశ్నలు రెండు విధాలుగా ఉన్నాయి. 1. పర్యావరణానికి సంబంధించిన బేసిక్ అంశాలు. 2. పర్యావరణంతో ముడిపడిన జాగ్రఫీ అంశాలు.
 విపత్తు నిర్వహణపై ఎలాంటి ప్రశ్నలు రాలేదు.
 ఈసారి వర్తమాన అంశాలకు సంబంధించి ప్రశ్నలు రానంత మాత్రాన వచ్చేసారి ఇలాగే ఉంటుందని చెప్పలేం. తప్పనిసరిగా సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ జాగ్రఫీని చదవాల్సిందే.

సైన్స్
ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు తేలిగ్గా సమాధానాలు గుర్తించేవిగా ఉన్నాయి. ప్రాథమిక అంశాలపైన ఎక్కువగా అడిగారు. ఫ్రిక్షన్, ఆప్టికల్ ఇల్యూజన్, రెయిన్‌బో తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. సమకాలీన అంశమైన హిగ్స్ బోసన్ పార్టికల్‌పై ప్రశ్న వచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం గుర్తించగలిగేలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.

Ex: Ball bearings are used in bicycles, cars, etc., because
 a) the actual area of contact between the wheel and axle is increased
 b) the effective area of contact between wheel and axle is increased
 c) the effective area of contact between the wheel and axle is increased
 d) None of the above statements is correct

జవాబు: c

సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి ప్రశ్నలు దాదాపు కనుమరుగయ్యాయి.
 బయాలజీ విభాగం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. కాన్సెప్ట్‌లపై పట్టున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించగలిగేలా ఉన్నాయి.

చరిత్ర
కొత్త సిలబస్ ప్రారంభమైన దగ్గర నుంచి (2011) చూస్తే ఇప్పటి వరకు చారిత్రక అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈసారి కూడా ప్రశ్నపత్రం సమతూకంగానే ఉంది.

ప్రాచీన భారత దేశ చరిత్ర నుంచి దాదాపు 50 శాతం ప్రశ్నలు రాగా, మధ్య, ఆధునిక చరిత్ర నుంచి 50 శాతం వచ్చాయి.
 గతంలో రాజకీయ చరిత్ర (పొలిటికల్ హిస్టరీ)కు సంబంధించి ఒకట్రెండు ప్రశ్నలు అడిగేవారు. అయితే ఈసారి ఆ విభాగాన్ని పక్కనపెట్టేశారు.
 ప్రాచీన భారత దేశ చరిత్ర నుంచి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆర్కిటెక్చర్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చారు.

Ex: Consider the following historical places:
 1. Ajanta Caves
 2. Lepakshi Temple
 3. Sanchi Stupa
Which of the above places is/are also known for mural paintings?
 a) 1 only b) 1 and 2 only
 c) 1, 2, and 3 d) None

జవాబు: c

గతంతో పోలిస్తే ఈసారి అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయి. కొన్ని డెరైక్ట్‌గా వస్తే మరికొన్ని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు వచ్చాయి.

Ex: the Chinese traveller Yuan Chwang (Hiuen Tsang) who visited India recorded the general conditions and culture of India at that time. In this context, which of the following statements is/are correct?
 1. The roads and river routes were completely immune from robbery.
 2. As regards punishment for offences, or deals by fire, water and poison were the instruments for determining the innocence or guilt of person.
 3. The tradesmen had to pay duties at ferries and barrier stations.
Select the correct answer using the codes given below.
 a) 1 only    b) 2 and 3 only   c) 1 and 3 only   d) 1, 2 and 3

జవాబు: b

ఇలాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించాలంటే ఓ అంశాన్ని విశ్లేషణాత్మక ధోరణితో చదవాల్సిందే.
 గతంలో హిస్టరీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అభ్యర్థిని తికమకపెట్టేవి. ప్రశ్నను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టేది. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు.

ఎకానమీ
 ఈ సబ్జెక్టు నుంచి ప్రశ్నలను ఎక్కువగా కాన్సెప్ట్‌పైనే అడిగారు. గతంతో పోలిస్తే ప్రశ్నల స్థాయి తగ్గిందని చెప్పొచ్చు.
 బ్యాంకింగ్ నుంచి నాలుగు ప్రశ్నలు వస్తే, అంతర్జాతీయ వాణిజ్యం నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి.
Ex: Priority Sector Lending by banks in India constitutes the lending to
 a) agriculture
 b) micro and small enterprises
 c) weaker sections d) All of the above

జవాబు: d

పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)
ప్రశ్నలు: 80 మార్కులు: 200

1. మూడు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేరాగ్రాఫ్‌లు ఇచ్చారు. వీటికింద ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి. ఒకసారి క్షుణ్నంగా చదివితే చాలు సమాధానాలు గుర్తించగలిగేలా ఉన్నాయి.
2. డెషిషన్ మేకింగ్ విభాగం నుంచి ఈసారి ఆరు ప్రశ్నలు వచ్చాయి. గతేడాది ఈ విభాగంలో ఏడు ప్రశ్నలు వచ్చాయి.
3. 2012లో నాన్ వెర్బల్ రీజనింగ్‌పై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఈ విభాగంలో ఒక్క ప్రశ్నా రాలేదు.
4. రీడింగ్ కాంప్రెహెన్షన్ ప్రశ్నలు 23 ఇచ్చారు. గతేడాది ఈ విభాగం కింద 30కు పైగా వచ్చాయి.
5. రీడింగ్ కాంప్రెహెన్షన్ పరిధిని తగ్గించి బేసిక్ న్యూమరసీ విభాగం ప్రశ్నలు పెంచారు.
6. మొత్తంమీద చూస్తే పేపర్-2 తేలిగ్గా కాకుండా మరీ అంత కఠినంగా కాకుండా మధ్యస్తంగా ఉంది.

200 మార్కులు దాటితే మెయిన్స్‌కు!

ప్రిలిమ్స్‌లో 200 మార్కులు (400 మార్కులకు) దాటిన జనరల్ అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షకు  ఎంపికయ్యే అవకాశముందన్నది నిపుణుల అంచనా. గతేడాది జనరల్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు 209.

పేపర్-1

 సబ్జెక్ట్                  ప్రశ్నలు
 హిస్టరీ                     15
 పాలిటీ                     19
 జాగ్రఫీ, ఎకాలజీ        27
 సైన్స్                       21
 ఎకానమీ                 18
 మొత్తం                    100


పేపర్-2
 సబ్జెక్ట్                          ప్రశ్నలు
 రీడింగ్ కాంప్రెహెన్షన్         23
 ఇంగ్లిష్ లాంగ్వేజ్               8
 బేసిక్ న్యూమరసీ            18
 జనరల్ మెంటల్ ఎబిలిటీ    7
 అనలిటికల్ రీజనింగ్        18
 డెషిషన్ మేకింగ్                6
 మొత్తం                           80

Published date : 31 May 2013 07:31PM

Photo Stories