UPSC Prelims Admit Card 2024: యూపీఎస్సీ సివిల్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తాజా ప్రకటన ద్వారా మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనన్నారు. కాగా దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణలో అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Telangana Medical Jobs 2024 : 5348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. త్వరలోనే..!
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఉదయం, మధ్యహ్నం రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు.
యూపీఎస్సీ సివిల్స్ అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ వివరాలు నమోదు చేసి ఎంటర్ చేయండి.
- తర్వాత స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్‌చేయండి.