సివిల్ సర్వెంట్ కావాలనే విద్యార్ధులకు ఐఏఎస్ మేఘనాథ్ రెడ్డి సూచనలు – సలహాలు..
Sakshi Education
ఐఏఎస్ మీ జీవిత గమ్యమా? ప్రిపరేషన్ స్కూల్, కాలేజ్, డిగ్రీ.. ఏ స్థాయిలో ప్రారంభించాలో తెలియదా? ఏ బుక్స్ చదవాలో, ఏఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలో అసలేం తెలియదా? భయపడకండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ జె. మేఘనాథ్ రెడ్డి గారి మాటల్లో.. మీ కోసం..
నీ లైఫ్ గోల్ ఏమిటి?
స్కూల్లో టీచర్లు అడిగిన వందలాది ప్రశ్నల్లో డ్రీమ్ గోల్ గురించి అడిగిన ప్రశ్న నాకెంతో ప్రత్యేకమైనది. నావంతు వచ్చినప్పుడు ‘నా గోల్ ఐఏఎస్’ అని గర్వంగా చెప్పడానికి ఎదురుచూసేవాడిని. ఆ ఒక్క మూమెంట్‌తో ప్రపంచంలోనే ఎతైన స్థానంలో ఉన్నట్టు ఫీల్ అయ్యే వాడిని. మన దేశంలోని లక్షలాదిమందిలాగానే ఐఏఎస్ నా చిన్ననాటి కల. నిజానికి అదే నా లోకం. నామట్టుకైతే ఐఏఎస్ అంటే జిల్లాకి కలెక్టర్. నేను విన్న అనేక స్టోరీలలోని కలెక్టర్ల అధికారం, హోదా, జనాకర్షన, పాపులారిటీ, మర్యాద, ప్రజా సేవ చేసే సామర్ధ్యం వల్ల ఎంతో స్ఫూర్తి (ఇన్‌స్పిరేషన్) పొందాను. చిన్నతనం నుంచి నా డ్రీమ్ ను సాధించుకోవడానికి తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు నన్ను ఎంతో ప్రోత్సహించడం నా అదృష్టం. నిజానికి నా సివిల్ సర్సీసెస్ ప్రిపరేషన్ 8 వ తరగతిలోనే ప్రారంభమైందని చెప్పాలి.
నా చిన్నతనం నుంచే...
విద్యార్ధుల్లో చిన్నతనం (పాఠశాల స్థాయి) నుంచే ఐఏఎస్ సాధించాలనే ట్రెండ్ పెరుగుతోంది. చిన్నతనం నుంచే పిల్లలు ఐఏఎస్ అవ్వాలని కలలుకనే తల్లిదండ్రులను చూడటం ఎంతో సంతోషాన్నిస్తుంది. అది మన భారతీయ సమాజం ఔత్సాహిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో, నా చిన్ననాటి కలను ఏ విధంగా నేరవేర్చుకోగలిగానో నా అనుభవాల ద్వారా మీతో పంచుకుంటాను...
ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే...
జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే ముందుగా దాని గురించిన కల (Dream) ఉండాలి. స్కూల్ డేస్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే పెద్ద డ్రీమ్ కలిగి ఉండటం తప్పుకాదు. ‘ఒక ఆలోచన (ఐడియా)ను తీసుకో, ఆ ఆలోచననే నీ జీవితంగా మలచుకో, దాని గురించే ఆలోచించు, దాని గురించే కలలుకను, ఆ ఆలోచనలోనే జీవించు’ అనే స్వామీ వివేకానంద పలుకులు నన్ను ఎప్పుడూ ప్రేరేపించేవి. విజయానికి ఇదే మార్గం. గొప్ప కార్యాలు, అద్భుతాలన్నీపెద్ద కలలు, బలమైన నమ్మకాలపైనే ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక విద్యార్థిగా, మీ కల ఐఏఎస్ అయితే, దాని గురించే కలలు కనండి, ఆ కలనే మీ జీవితంగా మలచుకోండి.
డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలంటే మార్గాలు...
డ్రీమ్స్ అనేవి శక్తివంతమైన ఆలోచనలు. కానీ, ఆ ఆలోచనలు ఎప్పుడైతే కార్యచరణలో పెడతారో అప్పుడే నెరవేరగలుగుతాయి. ఐఏఎస్‌లాంటి డ్రీమ్ అయితే ఇంకా చాలా చేయవలసి ఉంటుంది. స్కూల్ డేస్ నుంచే క్రమపద్ధతిలో ప్రిపేర్ అవ్వాలి. ఎందువల్లనంటే ఐఏఎస్ ప్రిపరేషన్‌కు కొన్ని ప్రత్యేకమైన సామర్ధ్యాలు, స్కిల్స్ అభివృద్ధి చేసుకోవల్సి ఉంటుంది.
ఏమేమి చేయాలంటే..?
చేయకూడనివి...
నా సివిల్స్ ప్రిపరేషన్‌లో భాగంగా కొన్ని చేదు అనుభవాలను చవిచూశాను. ఇక్కడ ఐఏఎస్‌కు ప్రిపేరయ్యే విద్యార్ధులు చేయకూడని జాబితా ఇస్తున్నాను. అవేంటంటే..
స్కూల్ లెవెల్ నుంచి చేయవలసిన పనులు...
ఐఏఎస్ కలని పాఠశాల స్థాయినుంచి నెరవేర్చుకోవాలంటే సూచనలు ఇవిగో..
ఈ కింది పుస్తకాలను చదవాలి..
తల్లిదండ్రులు ఏం చేయాలంటే..
ఐఏఎస్ ను మన దేశంలో ‘ఫ్యామిలీ డ్రీమ్’ అని అంటారు. ఇది పిల్లలు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల భాగస్వామ్యం కలిగిన కుటుంబాలు కనే కల. కానీ పిల్లల గుండెల్లో దాగిఉన్న విషయాలను తల్లిదండ్రులు గుర్తించగలగాలి. ఐఏఎస్ చిన్నపిల్లల్లో ఇన్‌స్పైర్డ్ డ్రీమ్ గా ఉండాలే కానీ ఇన్‌ఫ్లుయన్స్‌డ్ డ్రీమ్ గా ఉండకూడదు. ఐఏఎస్ సాధించే ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించడం చాలా ముఖ్యం. సివిల్స్ ప్రిపరేషన్‌లో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో పిల్లలపై పూర్తి విశ్వాసం ఉంచి వారికి అండగా నిలబడాలి. మరీ ముఖ్యంగా.. పరీక్షల్లో పిల్లలు ఫెయిల్ అయినా పాస్ అయినా వారికి తల్లిదండ్రులు అండగా ఉండి సామాజిక ఒత్తిడి (social stress) నుంచి కాపాడాలి.
చివరిగా..
ఐఏఎస్ లాంటి చిన్నప్పటి కలను సాధించడం కంటే పెద్ద విజయం జీవితంలో మరొకటి ఉండదు. సివిల్ సర్వీసెస్‌లో నేను, నా స్నేహితులు చాలా మంది చిన్నతనంలోనే సివిల్ సర్వెంట్ కావాలని కలలుకన్నాము. మా కలను సాకారం చేసుకోవడంలో ఎన్నో అడ్డంకులు, సవాలులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ జయించిన తర్వాతనే విజయం వల్ల కలిగే ఆనందాన్ని చవిచూశాము. ఐఏఎస్‌లోని అనేక సక్సెస్ స్టోరీస్‌లతోపాటు, నాది కూడా వైఫల్యాలు, సవాళలతో నిండిన స్టోరీనే. కానీ ప్రతి వైఫల్యంలోనూ వెనకడుగువేయకుండ పట్టుదలతో, అంకితభావంతో బలంపుంజుకుని మన గమ్యం వైపు పయనించాలి.
ఇందంతా హార్డ్‌వర్క్ (కష్టపడేతత్వం), కాన్ఫిడెంట్ (ఆత్మవిశ్వాసం), వైఫల్యాల నుంచి తిరిగి పునరుత్తేజం పొందటమనే విషయాల గురించి చెబుతున్నాననే విషయం మరచిపోకండి.
మీ కలను సాకారం చేసుకోవడంలో వీటిల్లో దేనిని వదలవద్దు. ‘‘మనవజాతి ప్రధాన బలహీణతల్లో ఒకటి సగటు మనిషికి ‘అసాధ్యం’ (Impossible) అనే పదం తెలిసి ఉండటం’’ అని నెపోలియన్ హిల్ మానవస్వభావం గురించి సరిగ్గా చెప్పాడు. మీ జీవితంలోని అసాధ్యం అనే పదాన్ని ఎప్పుడైతే పూర్తిగా తొలగిస్తారో అప్పుడే విజయం మీది అవుతుంది.
ఎందుకంటే Failure is Never Final and Success is Never Stop.

- ముందుగా మీ డ్రీమ్ గురించిన సమాచారం పూర్తిగా తెలుసుకోవాలి
సివిల్ సర్వీసెస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా మంది అభ్యర్ధులు వారి మొదటి అటెంప్ట్ వరకు సివిల్ సర్వీసెస్ గురించి వివరంగా తెలుసుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా పూర్తి వివరాలు తెసుకోవడంపై దృష్టి పెట్టాలి. అంటే సివిల్ సర్వీసెస్‌లో ఇంకా ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? ఈ పరీక్ష రాయాలంటే ఎంత వయసు ఉండాలి? అర్హతలు ఏమేమి ఉండాలి? పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది? అలాగే సిలబస్ గురించి కూడా తెలుసుకోవడం ద్వారా ఏ విషయాలు నేర్చుకోవాలో, వేటిపై దృష్టి పెట్టాలో అర్థమౌతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతాకూడా ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటించే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్, తల్లిదండ్రులకు సివిల్స్ సర్వీసెస్ గురించిన పూర్తి అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
- నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి..
అన్ని పోటీపరీక్షల మాదిరిగానే సివిల్ సర్వీసెస్‌కు కూడా కొన్ని నిర్ధిష్ట నైపుణ్యాలు అవసరం. వీటిని స్కూల్ లెవెల్ నుంచే గ్రహించవచ్చు.
- తెలుసుకోవాలనే ఉత్కంఠ...
అంటే ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ లేదా జ్ఞాన తృష్ణ లేదా తెలుసుకోవాలనే కూతూహలం లేదా తాపత్రయం అనవచ్చు. ప్రశ్నించడం దీనిలో అంతర్గతంగా దాగి ఉంటుంది. విద్యార్ధులకు ప్రశ్నించడం – అర్ధం చేసుకోవడం అనే లక్షణం తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సామాజిక సమస్యలు, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పొలిటికల్ డెవలప్‌మెంట్ వంటి సామాజిక అంశాలపై ప్రశ్నించడం అర్ధం చేసుకోగల సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధమైన కుతూహలం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు ఎంతో తోడ్పడుతుంది.
- కరెంట్ అఫైర్స్
సివిల్ సర్వీసెస్‌ను ఒక పదంలో నిర్వచించాలంటే ‘కరెంట్ అఫైర్స్’ అని చెప్పవచ్చు. ఎవరికైనా ఐఏఎస్ అవ్వాలనే డ్రీమ్ ఉంటే వారు ఖచ్చితంగా పాలిటిక్స్, ఎకానమీ, సొసైటీ (సమాజం), ఎన్విరాన్‌మెంట్ డెవలప్‌మెంట్ (పర్యావరణ అభివృద్ధి) వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా, అదే విధంగా దేశ వ్యాప్తంగా సమగ్ర అవగాహన ఉండాలి. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్లు, పుస్తకాలు చదవడం ద్వారా, ఇంటర్‌నెట్ సోర్సెస్, టీవీ చూడటం ద్వారా విద్యార్ధులు ఈ స్కిల్‌ను పెంపొంచుకోవచ్చు. విద్యార్ధులకు నా సలహా ఏంటంటే స్కూల్ డేస్ నుంచే విద్యార్ధులు ఇంగ్లీష్‌లో చదవడం, ప్రాంతీయ న్యూస్ పేపర్లు చదవడం అలవాటు చేసుకోవడం చేయాలి .
- రీడ్!రీడ్!రీడ్!
చదివే అలవాటు లేదా స్కిల్‌ను ఐఏఎస్‌కు సన్నద్ధమయ్యే విద్యార్ధులు త్వరగా వంటపట్టించుకోవాలి. ఏమి చదవాలి? ఎలా చదవాలి? అనే విషయంలో ఎటువంటి కొలమానాలు ఉండవు. మీ ఫేవరేట్ రచయిత పుస్తకాలైనా, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్లు ఏవైనా చదువుతూ ఉండాలి. ఐఏఎస్ ప్రిపరేషన్‌కు రీడింగ్ అలవాటు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడి) అనే విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి.
- రాయడం..
సివిల్స్ ప్రిపరేషన్ జ్ఞాన సముపార్జన (నేర్చుకోవడం), జ్ఞాన వ్యక్తీకరణ (అభివ్యక్తీకరించడం)ల సముదాయం అని నా నమ్మకం. భావ వ్యక్తీకరణలో రాత నైపుణ్యం కీలకమైనది. ముఖ్యంగా రాత విభాగమైన మెయిన్స్‌లో సాధించిన మార్కులు సివిల్ సర్వీసెస్‌లో ర్యాంక్ నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రాక్టీస్ ద్వారా రాత నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. విద్యార్ధులు రాసే నైపుణ్యాన్ని అలవాటుచేసుకోగలగాలి. ఎస్సే కాంపిటీషన్స్‌లో పాల్గొనటం, డైరీ రాయటం, షార్ట్ స్టోరీస్, పద్యాలు రాయటం.. ద్వారా రాత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.
- ఇంటర్ పర్సనల్ కమ్యునికేషన్..
సివిల్స్ ప్రిపరేషన్‌లో మరొక కీలక ఘట్టం కమ్యునికేషన్ స్కిల్స్. వీటిల్లో ముఖ్యమైనవి స్పీకింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్ కేవలం ఐఏఎస్ సాధించడానికి మాత్రమే కాదు ఐఏఎస్ ఆఫీసర్‌గా మీ ప్రయాణం విజయవంతంగా సాగడానికీ దోహద పడుతుంది. సివిల్స్ మెరిట్ లిస్ట్‌లో ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టరనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటర్వ్యూ బోర్డును మెప్పించేలా మాట్లాడాలంటే ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ ప్రధానం. స్పీకింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడానికి అనువైన ప్రదేశాలు పాఠశాలలు. క్లాస్‌రూం డిస్‌కషన్స్, డిబేట్స్, స్పీచ్ (వక్తృత్వ) కాంపిటీషన్స్ లో పాల్గొనటం ద్వారా విద్యార్ధులు మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందిచుకోవచ్చు. ప్రారంభంలో పబ్లిక్ స్పీకింగ్ కష్టంగా అనిపిస్తుంది. కానీ నిరంతర సాధనతో పబ్లిక్ స్పీకింగ్ (బహిరంగ ప్రసంగం) కళలో ప్రావీణ్యం సాధించవచ్చు.
చేయకూడనివి...
నా సివిల్స్ ప్రిపరేషన్‌లో భాగంగా కొన్ని చేదు అనుభవాలను చవిచూశాను. ఇక్కడ ఐఏఎస్‌కు ప్రిపేరయ్యే విద్యార్ధులు చేయకూడని జాబితా ఇస్తున్నాను. అవేంటంటే..
- ఎవరినీ అనుకరించకూడదు...
గుర్తుంచుకోండి.. ఐఏఎస్ ఖచ్చితంగా మీ డ్రీమ్ అయ్యి ఉండాలి. అది కేవలం మీలోనే ఉద్భవించినదై ఉండాలి. మీ పేరెంట్స్, మీ శ్రేయోభిలాషుల ద్వారా మీరు ప్రభావితులవ్వడం మంచిదే. కానీ, ఎవరి ఒత్తిడివల్లనో లేదా అసంపూర్ణ అభిరుచివల్లనో ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకోకూడదు. జీవితమంటే మన సొంత కలలను వెంటాడుతూ ఉండటం లేదా అనుకరించడం. అది ఐఏఎస్ కానీ ఇంకేదైనా అవ్వనీ. ఏ డ్రీమ్ కూడా చిన్నది కాదు.
- చదువును నిర్లక్ష్యం చేయకూడదు...
ఐఏఎస్ లక్ష్యంగా ఉండే కొందరు విద్యార్ధుల్లో కనిపించే మరో అవలక్షణం ఏంటంటే రెగ్యులర్ స్డడీస్‌ను నిర్లక్ష్యం చేయడం. ఇది అస్సలు చేయకూడదు. రెగ్యులర్ అకడమిక్స్ కూడా సివిల్స్‌లో కీలక పాత్ర పోషిస్తాయి.. మరీ ముఖ్యంగా పర్సనాలిటి టెస్ట్‌లో. స్కూల్ లేదా కాలేజ్ స్థాయి నుంచి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యేవారు ఖాళీ సమయాల్లో చదవాలే కానీ రెగ్యులర్ అకడమిక్ టైంలో కాదు.
- షార్ట్ కట్‌లను నమ్ముకోవద్దు..
‘ఇంటర్ నుంచే సివిల్స్ కోచింగ్’ అని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ చేసే విస్తృత పబ్లిసిటీని చూసి అనేక మంది విద్యార్ధులు వాటిల్లో చేరుతుంటారు. ఈ విధమైన సిస్టం ను ప్రశ్నించతలచుకోవట్లేదు. సమస్య ఎక్కడ తలెత్తుతుందంటే... చాలా మంది విద్యార్ధులు ఈ విధమైన ‘షార్ట్ వే’ లను నమ్ముకుని ప్రొఫెషనల్ కాలేజీల నుంచి వచ్చే డిగ్రీ ఆఫర్‌లను సైతం వదులుకుంటున్నారు. ఇటువంటి వాటికి ఎటువంటి గ్యారెంటీ ఉండదు. దయచేసి గుర్తుంచుకోండి, మీరు ఏ కాలేజీ నుంచైనా, ఏ డిగ్రీ కోర్సునైనా పూర్తి చేయవచ్చు. కోచింగ్ ఇచ్చే కాలేజీ నుంచైతే సివిల్స్‌ను సులువుగా సాధించవచ్చు అనేది కేవలం అపోహ మాత్రమే. ఈ విధమైన భావాలను తొలగించడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది.
- లక్ష్యాన్ని చిన్నదిగా భావించవద్దు..
ఐఏఎస్ ప్రిపరేషన్ ఫ్యాషన్‌లా కాకుండా అభిరుచి (Passion) లా ఉండాలి. ప్రతి దశలోని ప్రతి ప్రయత్నము ఎంతో నేర్పుతుంది. విద్యార్ధులు కేవలం అకడమిక్స్‌లో సాధించిన డిగ్రీలతో మాత్రమే ముందుకు వెళ్లలేరు. ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది బాల్ గేమ్ లాంటిది. హార్డ్ వర్క్ (కష్టపడేతత్వం), కాన్ఫిడెన్స్ (ఆత్మవిశ్వాసం), బ్యాక్ ఇన్‌టూ షేప్ (ఉత్తేజపరచుకోవటం) ఈ మూడింటి మీద మీ విజయం ఆధారపడి ఉంటుంది. ప్రిపరేషన్ లేదా పరీక్షలో ఓడిన ప్రతి సారి లేచే ప్రయత్నం చేయాలి. మన కీర్తి ఓడిపోయిన ప్రతిసారి చేజారిపోదు. కానీ ఓడిన ప్రతీసారీ మళ్లీ ప్రయత్నిస్తేనే పెరుగుతూ ఉంటుంది.
స్కూల్ లెవెల్ నుంచి చేయవలసిన పనులు...
ఐఏఎస్ కలని పాఠశాల స్థాయినుంచి నెరవేర్చుకోవాలంటే సూచనలు ఇవిగో..
- న్యూస్ పేపర్స్: ప్రతీ రోజు ఇంగ్లీష్, ప్రాంతీయ న్యూస్ పేపర్లను చదవాలి
- బేసిక్ జనరల్ నాలెడ్జ్‌ను పెంపొందించుకోవడానికి మనోరమ ఇయర్ బుక్ చదవాలి.
- వీక్లీ మ్యాగజైన్స్: ఔట్‌లుక్, ఇండియా టుడే, ఓపెన్ ది వీక్ లతోపాటు సివిల్స్ ప్రిపరేషన్ మ్యాగజైన్లు– సీఎస్‌ఆర్, సివిల్ సర్వీసెస్ క్రానికల్, ఇంకా యోజనా, టెల్ మి వై, విజ్‌డమ్... వంటి ఇతర మ్యాగజైన్లు చదవాలి.
- క్లాస్ రూం టెక్ట్స్ బుక్స్: ముఖ్యంగా సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, బయోలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట్. ఈ పుస్తకాలు జనరల్ స్టడీస్ పేపర్స్‌కు ఉపయోగపడతాయి.
- కాంపిటీషన్స్: స్కూళ్లలో జరిగే ఎస్సే రైటింగ్, వక్తృత్వపోటీలు, డిబేట్లు, సృజనాత్మక రచనలు.. వంటి పోటీల్లో పాల్గొనాలి. ఇక్కడ గెలువడం ముఖ్యం కాదు కాంపిటీషన్‌లో పాల్గొనడం ముఖ్యం. సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా పెంపొందించుకోవాలి. ఈ స్కిల్స్ సివిల్స్ పరీక్షల సమయంలో తోడ్పడతాయి. అంతేకాకుండా స్కూల్ జర్నల్స్ లేదా మాగజైన్లు రాసే అలవాటు కూడా పెంపొందించుకోవచ్చు.
ఈ కింది పుస్తకాలను చదవాలి..
- ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్– బిపిన్ చంద్ర
- ఇండియా ఆఫ్టర్ గాంధీ– రామచంద్ర గుహ
- ది వండర్ దట్ వాజ్ ఇండియా– ఏఎల్ బాషాం
- అవర్ కాన్‌స్టిట్యూషన్– సుభాష్ కష్యప్
- ది కన్‌సైజ్ ఆక్స్‌ఫర్డ్ కాంపానియన్ టు ఎకనామిక్స్/పాలిటిక్స్ ఇన్ ఇండియా మొదలైనవి.
తల్లిదండ్రులు ఏం చేయాలంటే..
ఐఏఎస్ ను మన దేశంలో ‘ఫ్యామిలీ డ్రీమ్’ అని అంటారు. ఇది పిల్లలు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల భాగస్వామ్యం కలిగిన కుటుంబాలు కనే కల. కానీ పిల్లల గుండెల్లో దాగిఉన్న విషయాలను తల్లిదండ్రులు గుర్తించగలగాలి. ఐఏఎస్ చిన్నపిల్లల్లో ఇన్‌స్పైర్డ్ డ్రీమ్ గా ఉండాలే కానీ ఇన్‌ఫ్లుయన్స్‌డ్ డ్రీమ్ గా ఉండకూడదు. ఐఏఎస్ సాధించే ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించడం చాలా ముఖ్యం. సివిల్స్ ప్రిపరేషన్‌లో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో పిల్లలపై పూర్తి విశ్వాసం ఉంచి వారికి అండగా నిలబడాలి. మరీ ముఖ్యంగా.. పరీక్షల్లో పిల్లలు ఫెయిల్ అయినా పాస్ అయినా వారికి తల్లిదండ్రులు అండగా ఉండి సామాజిక ఒత్తిడి (social stress) నుంచి కాపాడాలి.
చివరిగా..
ఐఏఎస్ లాంటి చిన్నప్పటి కలను సాధించడం కంటే పెద్ద విజయం జీవితంలో మరొకటి ఉండదు. సివిల్ సర్వీసెస్‌లో నేను, నా స్నేహితులు చాలా మంది చిన్నతనంలోనే సివిల్ సర్వెంట్ కావాలని కలలుకన్నాము. మా కలను సాకారం చేసుకోవడంలో ఎన్నో అడ్డంకులు, సవాలులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ జయించిన తర్వాతనే విజయం వల్ల కలిగే ఆనందాన్ని చవిచూశాము. ఐఏఎస్‌లోని అనేక సక్సెస్ స్టోరీస్‌లతోపాటు, నాది కూడా వైఫల్యాలు, సవాళలతో నిండిన స్టోరీనే. కానీ ప్రతి వైఫల్యంలోనూ వెనకడుగువేయకుండ పట్టుదలతో, అంకితభావంతో బలంపుంజుకుని మన గమ్యం వైపు పయనించాలి.
ఇందంతా హార్డ్‌వర్క్ (కష్టపడేతత్వం), కాన్ఫిడెంట్ (ఆత్మవిశ్వాసం), వైఫల్యాల నుంచి తిరిగి పునరుత్తేజం పొందటమనే విషయాల గురించి చెబుతున్నాననే విషయం మరచిపోకండి.
మీ కలను సాకారం చేసుకోవడంలో వీటిల్లో దేనిని వదలవద్దు. ‘‘మనవజాతి ప్రధాన బలహీణతల్లో ఒకటి సగటు మనిషికి ‘అసాధ్యం’ (Impossible) అనే పదం తెలిసి ఉండటం’’ అని నెపోలియన్ హిల్ మానవస్వభావం గురించి సరిగ్గా చెప్పాడు. మీ జీవితంలోని అసాధ్యం అనే పదాన్ని ఎప్పుడైతే పూర్తిగా తొలగిస్తారో అప్పుడే విజయం మీది అవుతుంది.
ఎందుకంటే Failure is Never Final and Success is Never Stop.
Published date : 10 Apr 2021 03:07PM