Skip to main content

IRS Officer Creates History: సివిల్‌ సర్వీస్‌ హిస్టరీలో ఇదే తొలిసారి.. ఆమె పేరు మారింది..జెండర్‌ మారింది

IRS Officer Creates History

సాక్షి,హైదరాబాద్‌ : ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ హిస్టరీలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ సివిల్‌ సర్వీస్ (సీనియర్‌ ఐఆర్‌ఎస్‌)ఉద్యోగి తన పేరుతో పాటు జెండర్‌ను మార్చుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతివ్వడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అన్నీ రికార్డ్స్‌లలో సదరు ఉద్యోగి పేరు,జెండర్‌ ఇతర వివరాలు మారిపోనున్నాయి.

హైదరాబాద్‌ కేంద్రంగా కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ (సీఈఎస్‌టీఏటీ) విభాగంలో 35ఏళ్ల అనసూయ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

CUET UG Answer Key 2024 Released: సీయూఈటీ యూజీ ఆన్సర్‌ కీ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

అయితే తన పేరును అనుసూయకు బదులు తన పేరును ఎం అనుకతిర్‌ సూర్యగా, జెండర్‌ను సైతం మార్చాలని కేంద్రానికి అభ్యర్ధించారు.అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుసూర్య పేరును ఎం.అనుకతిర్‌ సూర్యగా మార్చడంతో పాటు జెండర్‌ సైతం మార్చేందుకు అంగీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.  

చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా
అనుకతిర్ సూర్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. సూర్య 2013 డిసెంబర్‌లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్‌గా పదోన్నతి పొందారు. గతేడాది హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు.  

Jobs at IGGL : ఐజీజీఎల్‌లో 22 ఉద్యోగాలు.. భ‌ర్తీకి వీరే అర్హులు..!

అనుకతిర్‌  సూర్య చదువు
అతను చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని,2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.

Published date : 10 Jul 2024 10:35AM

Photo Stories