Anusuya to Anukathir Surya Gender Change: ఇండియన్ సివిల్ సర్వీసుల చరిత్రలో తొలిసారి కీలక పరిణామం
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని రికార్డుల్లో సదరు అధి కారిణి పేరు, జెండర్ ఇతర వివరాలు మారిపోనున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (సీఈఎ స్టీఏటీ) విభాగంలో 35 ఏళ్ల అనసూయ సీనియర్ జాయింట్ కమిషనర్ విధులు నిర్వహిస్తున్నారు.
అయితే తన పేరును అనసూయకు బదులు ఎం .అనుకతీర్ సూర్యగా, తన జెండర్‌ను (స్త్రీ నుంచి పురుషుడిగా మార్చాలని కేంద్రానికి అభ్యర్థిం చారు. అందుకు కేంద్రం సానుకూలంగా స్పందిం చింది. అనసూయ పేరును ఎం.అనుకతీర్ సూర్యగా మార్చడంతో పాటు జెండర్ మార్చేం దుకు అంగీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
అనుకతీర్ సూర్య 2013 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారిణి. డిసెంబర్ చెన్నైలో అసి స్టెంట్ కమిషనర్ గా కెరీర్‌ను ప్రారంభించారు.
2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొం దారు. గతేడాది హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. అతను చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీని, 2023లో భోపాల్లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ 'లా అండ్ సైబర్ ఫోరెన్సిక్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.
చదవండి: Roshni Nadar Malhotra: టెక్ దిగ్గజం రోష్ని నాడార్‌కు అత్యున్నత పురస్కారం
గతంలో ఒడిశాలో..
సుప్రీంకోర్టు 2014, ఏప్రిల్‌లో నల్సా (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) కేసులో థర్డ్ జెండర్‌ను గుర్తిస్తూ.. ఒక వ్యక్తి సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ చేయించుకున్నా, చేయించుకోపోయినా లింగ గుర్తింపు అనేది వ్యక్తిగత ఎంపిక అని తీర్పునిచ్చిం ది. ఒడిశాకు చెందిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా 2015లో తన జెండర్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఐశ్వర్య రితుపర్ణ ప్రధాన్ (పురుషుడి నుంచి స్త్రీగా) జెండర్ ను మార్చుకున్నారు.
Tags
- Central Finance Department
- Anusuya
- Anukathir Surya
- IRS officer
- Gender Change
- Indian civil services
- Customs Excise and Service Tax Appellate Tribunal
- CESTAT
- National Legal Services Authority
- IIT Madras
- Aishwarya Rituparna Pradhan
- NameChanges
- GenderChange
- UnionFinanceDepartment
- CivilServicesApproval
- GovernmentDecision
- CivilServicesNews
- historical development
- sakshieducation latest News Telugu News