New ED Chief : ఈడీ కొత్త చీఫ్‌గా రాహుల్ నవీన్
Sakshi Education

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్ నవీన్ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన నవీన్ ఈడీ డైరెక్టర్‌గా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.
Mount Elbrus: మౌంట్ ఎల్‌బ్రస్‌ను అధిరోహించిన తెలుగుతేజం ఈయనే..
57 ఏళ్ల నవీన్ ఈడీలో 2019 నవంబర్‌లో ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెప్టెంబర్ 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Published date : 21 Aug 2024 11:08AM