Skip to main content

IAS Officer Salary : క‌లెక్ట‌ర్‌కు ఎంత‌ జీతం ఇస్తారంటే..?

ఏ త‌ల్లిదండ్రులైన మా వోడు బాగా చదివేసి కలెక్టరయిపోతాడని ప్రతి ఒక్క‌రు కోరుకుంటాడు. కలెక్టర్ అయితే హోదా వస్తుంది.. మరి జీతం వస్తుందా ? కలెక్టర్ల హోదాను చూసి జీతం ఎంతో .. ఊహించనంత ఉంటుందని అనుకుంటారు.

నిజానికి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు నెలకు జీతాల‌తో అలవెన్స్ కింది విధంగా ఉంటాయి.

ఐఏఎస్ (IAS) అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వీరు దేశంలోని బ్యూరోక్రాటిక్ నిర్మాణంలో పని చేసే అవకాశం పొందుతారు. ఐఏఎస్ అధికారులను ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, పరిపాలనా విభాగాలలో నియమిస్తారు. ఐఏఎస్‌కి తన మొత్తం సర్వీస్‌లో అత్యున్నత పదవి 'కేబినెట్ సెక్రటరీ'. ప్రతి ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఈ పదవికి చేరుకోవాలని అనుకుంటారు.

చ‌ద‌వండి: UPSC : తెలుగు మీడియం అభ్య‌ర్థులు.. సివిల్స్ కొట్ట‌డం ఎలా..? || ఎలా చ‌ద‌వాలి..?

చాలా తక్కువ మంది మాత్రమే.. ఈ ఉద్యోగానికి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు ప్రతి సంవత్సరం ఈ పరీక్షకు హాజరవుతారు. ఇందులో కొంతమంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించగలుగుతారు. అయితే వారిలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్‌) అధికారులు అవుతారు. మన సమాజంలో ఐఏఎస్ అధికారికి ఎంతో గౌరవం ఉంటుంది. ఒక ఐఏఎస్ అధికారి జీతం ఎంత, వారికి ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం.

UPSC ESE-2023 Notification: ఇంజనీరింగ్‌ కొలువులకు మార్గాలు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
 
జీతంతో పాటు.. ఇవి కూడా క‌లిపి మొత్తం..

IAS Officer Salary

ఒక ఐఏఎస్‌ అధికారి జీతం గురించి మాట్లాడితే అతను ఏడో వేతన కమిషన్ కింద బేసిక్‌ వేతనంగా రూ.56,100 పొందుతాడు. ఇది కాకుండా ఐఏఎస్ అధికారులకు ట్రావెలింగ్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్‌తో సహా అనేక ఇతర అలవెన్సులు ఉంటాయి. మీడియా కథనాల ప్రకారం ఒక ఐఏఎస్ అధికారికి నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ జీతం వస్తుంది. అలాగే ఒక ఐఏఎస్ అధికారి క్యాబినెట్ సెక్రటరీ పదవికి చేరుకుంటే అతనికి నెలకు దాదాపు 2.5 లక్షల రూపాయల జీతం లభిస్తుంది.

సంవ‌త్స‌రానికి..

Salary Ias

ఐఏఎస్ కెరీర్ ‌లో మొద‌టి సంవ‌త్స‌రం నుంచి 4వ సంవ‌త్స‌రం వ‌ర‌కు ప‌ని చేయాలి.ఇందులో వారికి బేసిక్ పే రూ.56,100 లభిస్తుంది, ఈ సమయలో ఏఎస్‌పీ, ఎస్‌డీఎం, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత 5వ సంవ‌త్స‌రం నుంచి 8వ సంవ‌త్స‌రం వ‌రకు డిప్యూటీ సెక్రెట‌రీ, అండ‌ర్ సెక్రెట‌రీ పోస్టులలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇక ఆ సమయంలో రూ.67,700 జీతం అందుకుంటారు . ఇలా వారి పదవి కలం అనుసరించి జీతం పెరగడం, అలాగే ప్రమోషన్స్ ఇస్తారు. ఇక వారి కెరీర్‌లో 34వ‌ ఏడాది నుంచి 36వ ఏడాది వ‌ర‌కు పని చేస్తే చీఫ్ సెక్రెట‌రీగా పదివి పొందుతూ రూ.2.25 ల‌క్ష‌ల వేత‌నం పొందుతారు. అలాగే 37 ఏళ్ల‌కు పైగా కెరీర్ ఉన్న‌వారికి క్యాబినెట్ సెక్రెట‌రీ ఆఫ్ ఇండియా పోస్టు ఇవ్వడం జరుగుతుంది.

Civils Results : సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు...ఐఏఎస్ అయ్యాడిలా..

జీతం కాకుండా ఐఏఎస్‌ అధికారులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వివిధ పే బ్యాండ్‌ల కింద పోస్ట్ ప్రకారం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందిస్తారు. ఇందులో జూనియర్ స్కేల్, సీనియర్ స్కేల్, సూపర్ టైమ్ స్కేల్ వంటి పే బ్యాండ్‌లు ఉంటాయి. బేసిక్‌ జీతం, గ్రేడ్ పే కాకుండా ఒక IAS అధికారి హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్ పొందుతారు. పే-బ్యాండ్ ఆధారంగా ఐఏఎస్ అధికారులకు ఇల్లు, వంట మనిషి, గృహ సిబ్బందితో సహా అనేక సౌకర్యాలు కల్పిస్తారు. ఒక ఐఏఎస్ అధికారి ఉద్యోగంలో భాగంగా ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే అక్కడ కూడా ప్రభుత్వ గృహం కేటాయిస్తారు. ఇది కాకుండా ఎక్కడికైనా ప్రయాణించడానికి కారు, డ్రైవర్ అందుబాటులో ఉంటారు. 

నిజానికి వారికి వచ్చే జీతం..

ias officer salary

ఐఏఎస్‌ల జీతం ఇప్పుడు ఉన్న‌ ఐటీ ఉద్యోగుల కన్నా తక్కువే. ఐదు.. పదేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఐటీ ఉద్యోగులు.. రెండు, మూడు సంస్థలు మారితే.. ఏకంగా రూ.లక్ష జీతం దగ్గరకు చేరుకుంటున్నారు. సీనియార్టీ అలా పెరిగితే.. జీతం కూడా లక్షల్లో పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు టాలెంట్ ఉన్న ఐటీ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగికి రూ.రెండున్నర లక్షలు చాలా సులువుగా వస్తూ ఉంటాయి. వారికి అనేక సౌకర్యాలు కూడా ఉంటాయి. వారంలో ఐదు రోజులు వర్కింగ్ డేస్ తో పాటు.. ఇతర టెన్షన్లు ఉండవు.

Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

Published date : 17 Nov 2022 05:11PM

Photo Stories