సివిల్స్ సర్వీసెస్ ఇంటర్వూల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలివే..
చాలామంది బుక్ రీడింగ్, వాచింగ్ టీవీ, సింగింగ్, ప్లేయింగ్, మూవీస్ వంటి వాటిని పేర్కొంటారు. ఇంటర్వూ్యలో వీటిపైనా ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని గుర్తించాలి. బుక్ రీడింగ్‌కు సంబంధించి.. మీకు నచ్చే రచనలు, రచయిత, సదరు రచయిత ప్రచురణల్లో ముఖ్యమైనవి, వాటిలో పేర్కొన్న కొటేషన్లు, వాటి అర్థాలు, సదరు రచన సారాంశం లేదా ఉద్దేశం తదితరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. బోర్డ్‌లో పలు నేపథ్యాల నిపుణులు ఉంటారు. వారు సదరు రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివారా.. అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి.. లేదా అందులో వివాదాస్పదమైన విషయం.. వంటి ప్రశ్నలు అడుగుతారు. గత ఏడాది.. సింగింగ్ హాబీగా పేర్కొన్న అభ్యర్థిని.. ఏదైనా ఒక పాట పాడమని అడిగారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని గుర్తించాలి.
స్థానిక పరిస్థితులు, సమస్యలు..
అభ్యర్థులు తమ స్వస్థలానికి సంబంధించిన సామాజిక, చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలి. స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహనతోపాటు, పరిష్కార మార్గాలు కూడా చెప్పగలగాలి. అభ్యర్థుల వ్యక్తిగత బలాలు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ బలాలు, బలహీనతల గురించి చెప్పేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ‘అగ్రెసివ్‌నెస్’, ‘సహనం తక్కువ’ వంటివి చెప్పడం సరికాదు.
కరెంట్ అఫైర్స్..
ఇంటర్వూలో వర్తమాన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పర్సనల్, ప్రొఫెషనల్ వివరాలే కాకుండా.. కరెంట్ అఫైర్స్‌పైనా పట్టు సాధించాలి. ముఖ్యంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన కరోనా.. దాని నివారణకు అంతర్జాతీయంగా పలు దేశాలు చేపడుతున్న చర్యలు.. మన దేశంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ పాలసీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అదే విధంగా అంతర్జాతీయ ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి తెలుసుకోవాలి. ప్రతిరోజు కనీసం రెండు దినపత్రికలు చదవాలి. ఇంటర్వూ రోజు తప్పనిసరిగా దినపత్రికలు చదివి వెళ్లడం ఎంతో అవసరం. కొన్ని సందర్భాల్లో ‘ఈ రోజు ఏ పేపర్ చదివారు.. అందులో మీరు ప్రధానంగా భావించిన వార్త ఏది.. వంటి ప్రశ్నలు సైతం అడిగే అవకాశం ఉంటుంది.
చర్చా వేదికగా..
ఇంటర్వూలో అభ్యర్థులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే సామర్థ్యం అలవర్చుకోవాలి. అలాగే 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో నిర్వహించేS ఇంటర్వూ్యలో.. కొన్నిసార్లు ఒకే అంశంపై చిన్నపాటి చర్చ జరిగే పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాంటప్పుడు ఆయా అంశంపై అభ్యర్థికి సమగ్ర అవగాహన ఉండటం ఎంతో అవసరం.
ఇంకా చదవండి: part 3: ఇంటర్వూ సభ్యులు అభ్యర్థిల్లో ముఖ్యంగా పరీక్షించేవి ఇవే..