IBPS Notification 2024 : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్ట్‌కు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల..
ప్రభుత్వ బ్యాంకింగ్ నియామక సంస్థ ఐబీపీఎస్.. తాజాగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. నియామకం ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ ఎస్‌ఓ పోస్టులు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర సమాచారం..
మొత్తం పోస్టులు 896
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ తదితర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు బ్యాంకు ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి ఐబీపీఎస్ ఎస్‌ఓ నోటిఫికేషన్ చక్కటి అవకాశం. సంబంధిత అర్హతలు ఉన్నవారు సరైన వ్యూహంతో ప్రిపరేషన్ సాగిస్తే స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువు సొంతం చేసుకోవచ్చు. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి ఐబీపీఎస్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
Constable and Head Constable Posts : ఐటీబీపీలో 128 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పోస్టులు, అర్హుల వివరాలు ఇలా..
అర్హతలు
➩ ఆయా పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్,లా,అగ్రికల్చర్ అనుబంధ కోర్సు ల్లో యూజీ,పీజీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
➩ వయసు: అన్ని పోస్ట్‌లకు ఆగస్ట్ 1, 2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ (నాన్–క్రీమీ లేయర్) వర్గాల వారికి మూడేళ్ల సడలింపు లభిస్తుంది.
మూడు దశల ఎంపిక ప్రక్రియ
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్ట్‌లకు మూడు దశలలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ పరీక్షను లా ఆఫీసర్, రాజ్ భాష అధికారి పోస్ట్‌లకు, ఇతర పోస్ట్‌లకు వేర్వేరుగా నిర్వహిస్తారు.
లా ఆఫీసర్, రాజ్ భాష అధికారి ప్రిలిమినరీ
ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. మొత్తంగా 150 ప్రశ్నలు–125 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
ITBA Constable Posts : ఐటీబీపీలో వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
ఇతర పోస్ట్‌లకు ప్రిలిమ్స్ ఇలా
ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్‌లకు జరిపే ప్రిలిమ్స్ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు–25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. రెండు రకాల పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా మిగతా విభాగాలకు ఇంగ్లిష్ లేదా హిందీ మీడియంలలో హాజరుకావచ్చు.
రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్
➩ ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన వారిని మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. రాజ్ భాష అధికారి పోస్ట్‌లకు నిర్వహించే మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో, మిగతా పోస్ట్‌లకు జరిగే మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.
➩ రాజ్ భాష అధికారి మెయిన్ ఎగ్జామినేషన్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై 45 ప్రశ్నలతోపాటు డిస్క్రిప్టివ్ విధానంలో మరో 2 ప్రశ్నలు ఉంటాయి. రెండింటికి కలిపి పరీక్ష సమయం ఒక గంట. రెండు విభాగాలకు సంబంధించి మొత్తం 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ఇంగ్లిష్ లేదా హిందీ మీడియంలో ఒక ఎస్సే రైటింగ్, ఒక లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది.
➩ ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్‌లకు నిర్వహించే మెయిన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై 60 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 45నిమిషాలు.
➩ ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 కోత విధిస్తారు.
TSPSC Exams Notifications 2024 : ఈ ప్రకారమే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తాం.. అలాగే..
చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఖాళీలను అనుసరించి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు జరిగే పర్సనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంపై ఉన్న ఆసక్తి, ఈ రంగంలో తాజా పరిణామాలపై అవగాహన, వ్యక్తిగత దృక్పథం, వైఖరి వంటి అంశాలను పరిశీలిస్తారు.
80 : 20 వెయిటేజీ విధానం
తుది జాబితా రూపకల్పనలో మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూలలో పొందిన మార్కులకు 80 : 20 నిష్పత్తిలో వెయిటేజీ విధానాన్ని అనుసరించి విజేతలను ఖరారు చేస్తారు.
44,228 Postal GDS Result Release Date 2024 : ఏక్షణంలోనై 44,228 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలు ఫలితాలు విడుదల.. వెరిఫికేషన్‌కు కావల్సిన సర్టిఫికేట్స్
ముఖ్య సమాచారం
➩ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➩ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఆగస్ట్ 21.
➩ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2024, నవంబర్‌లో నిర్వహించే అవకాశం.
➩ ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ తేదీ: 2024, డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం.
➩ పర్సనల్ ఇంటర్వ్యూలు: 2025, ఫిబ్రవరి/మార్చిలో జరిగే అవకాశం.
➩ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in/index.php/specialisto-fficer-sxiv
రాత పరీక్షలో రాణించేలా
బ్యాంకు పరీక్షలంటేనే తీవ్రమైన పోటీ నెలకొంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందుకు తగ్గట్టుగా పటిష్ట ప్రణాళికతో సమగ్ర ప్రిపరేషన్ సాగించాలి. వేగంతోపాటు కచ్చితత్వంపై దృష్టిపెట్టాలి. అప్పుడే విజయావకాశాలు మెరుగవుతాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
RRC Northern Railway Apprenticeship Notification 2024 : రైల్వేలో 4,096 ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండిలా.. !
రీజనింగ్
ఇందులో సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై ఫోకస్ చేయాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్
లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్ట్‌ల ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఉండే విభాగం ఇది. జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్
మెయిన్ పరీక్షలో ఉండే ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు అభ్యర్థులు తమ బ్యాచిలర్, పీజీ స్థాయి అకడెమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో అవగాహన చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
NCC.. దేశ సేవకు మేము సైతం..! ఎన్‌సీసీ క్యాడెట్ల సర్టిఫికెట్ A, B, C ప్రయోజనాలు ఇవే..
Tags
- bank jobs
- IBPS Recruitments
- Job Notifications
- Bank jobs notification
- Public sector banks
- Professional Courses
- online applications
- prelims and mains exam
- eligible candidates for ibps jobs
- Institute of Banking Personnel Selection
- Institute of Banking Personnel Selection Jobs
- Education News
- Sakshi Education News