Skip to main content

ITBA Constable Posts : ఐటీబీపీలో వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ (పయనీర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Various constable posts at Indo-Tibetan Border Police Force  Eligible candidates applying for ITBP Constable (Pioneer) posts  ITBP recruitment notice for Constable (Pioneer) positions ITBP Constable (Pioneer) application form  ITBP Constable (Pioneer) recruitment

➯    మొత్తం పోస్టుల సంఖ్య: 202
➯    పోస్టుల వివరాలు: కానిస్టేబుల్‌(కార్పెంటర్‌)(పురుషులు)–61, కానిస్టేబుల్‌ (కార్పెంటర్‌)(మహిళలు)–10, కానిస్టేబుల్‌(ప్లంబర్‌) (పురుషులు)–44, కానిస్టేబుల్‌(ప్లంబర్‌) (మహిళలు)–08, కానిస్టేబుల్‌(మేసన్‌)(పురుషులు)–54, కానిస్టేబుల్‌(మేసన్‌)(మహిళలు)–10, కానిస్టేబుల్‌(ఎలక్ట్రీషియన్‌) (పురుషులు)–14, కానిస్టేబుల్‌(ఎలక్ట్రీషియన్‌) (మహిళలు)–01.
➯    అర్హత: మెట్రిక్యులేషన్‌/పదో తరగతితో పాటు ఐటీఐ (మేసన్‌/కార్పెంటర్‌ /ప్లంబర్‌/ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
➯    వయసు: 10.09.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
➯    పే స్కేల్‌: నెలకు రూ.21,700 నుంచి 69,100.
➯    ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 
➯    పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ ఇంగ్లిష్‌(20 ప్రశ్నలు–20 మార్కులు), జనరల్‌ హిందీ(20 ప్రశ్నలు–20 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(20 ప్రశ్నలు–20 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(20 ప్రశ్నలు–20 మార్కులు), సింపుల్‌ రీజనింగ్‌(20 ప్రశ్నలు–20 మార్కులు) సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ముఖ్య సమాచారం
➯    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➯    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.08.2024.
➯    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.09.2024
➯    వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in

TSPSC Exams Notifications 2024 : ఈ ప్ర‌కార‌మే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం.. అలాగే..

Published date : 17 Aug 2024 11:27AM

Photo Stories