Skip to main content

Constable and Head Constable Posts : ఐటీబీపీలో 128 హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పోస్టులు, అర్హుల వివరాలు ఇలా..

ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Constable and Head Constable Posts at Indo-Tibetan Border Police Force

➦    మొత్తం పోస్టుల సంఖ్య: 128.
➦    పోస్టుల వివరాలు: హెడ్‌ కానిస్టేబుల్‌(డ్రెస్సర్‌ వెటర్నరీ)–09, కానిస్టేబుల్‌ (యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌)–115, కానిస్టేబుల్‌(కెన్నెల్‌మ్యాన్‌)–04.
➦    అర్హత: హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 12వ తరగతితోపాటు పారా వెటర్నరీ కోర్సు లేదా డిప్లొమా లేదా వెటర్నరీ సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. కానిస్టేబుల్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
➦    పే స్కేల్‌: నెలకు హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.25,500–రూ.81,100. కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700–రూ.69,100 వేతన శ్రేణి లభిస్తుంది.
➦    వయసు: 10.09.2024 నాటికి హెడ్‌ కానిస్టేబుల్‌/కానిస్టేబుల్‌(కెన్నెల్‌మన్‌) పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్‌(యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌)పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
➦    ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష,ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్,మెడి కల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
➦    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➦    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.08.2024.
➦    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.09.2024
➦    వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in

44,228 Postal GDS Result Release Date 2024 : ఏక్ష‌ణంలోనై 44,228 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలు ఫ‌లితాలు విడుద‌ల‌.. వెరిఫికేష‌న్‌కు కావల్సిన సర్టిఫికేట్స్

Published date : 16 Aug 2024 10:40AM

Photo Stories