Tenth Examinations: సబ్జెక్టు ప్రకారంగా ప్రణాళిక సిద్ధం.. విద్యార్థుల ప్రతిభే ముఖ్యం..!
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు పిల్లలను సమాయత్తం చేయాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసింది. ఏడు పేపర్ల విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించింది. పరీక్షల సమయం దగ్గర పడుతోంది. మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యమే. ఈ ఏడాది అన్నమయ్య జిల్లాలో 25,522 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలా సన్నద్ధం కావాలో సబ్జెక్టు నిపుణులు సూచిస్తున్నారు.
NAAC Committee: యూనివర్సిటీలో న్యాక్ బృందం మూడు రోజుల సందర్శన..!
సమయం కీలకం
ఈ 27 రోజులు ఏడు సబెక్టులు ప్రణాళిక బద్ధంగా చదవాలి. ప్రణాళిక సిద్ధం చేసుకుంటే సీ, డీ గ్రేడుల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత.. ఏ, బీ గ్రేడుల్లోని వారు ఆశించిన మేరకు మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
అర్థం చేసుకుని చదివితే ఆంగ్లం సులువే
విద్యార్థులు ఆంగ్లమంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అంశాలకు అనుగుణంగా సొంతంగా రాయడంపై సాధన చేయాలి. ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లలో 1–35 వరకు ప్రశ్నలుంటాయి. సెక్షన్ –ఏలో మూడు పాసేజ్‌లు పాఠ్యాంశం నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 30 మార్కులు వస్తాయి. పాఠ్య పుస్తకంపై అవగాహనతో 30 మార్కులు సులభంగా సాధించవచ్చు. సెక్షన్–బిలో 16వ ప్రశ్న నుంచి 32వ ప్రశ్న వరకు 17 ప్రశ్నలు 40 మార్కులకు ఇస్తారు. పాఠ్యపుస్తకంలోని గ్రామర్, ఒకాబ్లరీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి పాఠ్యాంశం వెనుక ఉన్న గ్రామర్, ఒకాబ్లరీ చదవడం ద్వారా 40 మార్కులు సాధించే వీలుంది.
–పి.మహమ్మద్‌ఖాన్, ఎస్‌ఏ(ఇంగ్లిష్), జెడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె
Intermediate Students: ఇంటర్ విద్యార్థులకు జయిభవ కార్యక్రమంతో శిక్షణ..
సూత్రాలపై పట్టు.. మార్కులు కొట్టు
గణితం సాధన చేయాల్సిందే. 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు చాయిస్ లేదు. 8 మార్కుల ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఉంటుంది. ఒక మార్కు ప్రశ్నలపై దృష్టి సారిస్తే ఏ, బీ గ్రేడ్ విద్యార్థులు 95కు పైగా మార్కులు సాధిస్తారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థులు గ్రాఫ్‌లు, నిర్మాణాలు, పటాలపై దృష్టి సారిస్తే కనీసం 15 మార్కులు సాధిస్తారు. సమితులు, సంభావిత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, వాస్తవ సంఖ్యలు శ్రద్ధగా చదివితే సీ, డీ గ్రేడ్ విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు.
–పి.సుధాకర్‌రెడ్డి, స్కూల్ అసిస్టెంట్, గణితంజెడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె
పునశ్చరణ ముఖ్యం
భౌతిక, రసాయన శాస్త్రం కలిపి 50 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. భౌతికశాస్త్రంలో కాంతి, విద్యుత్ యూనిట్లు, సూత్రాల ఉత్పాదన, గణన, నిత్యజీవిత వినియోగం, భేదాలపై దృష్టి పెట్టాలి. రసాయనశాస్త్రంలో కర్బక సమ్మేళనాలు, సమీకరణాలు, పరమాణు నిర్మాణం, లోహ సంగ్రహణ శాస్త్రంపై పట్టు సాధించాలి.
–రసూల్‌బావాజీ, ఎస్‌ఏ(పీఎస్), జెడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె
Intermediate: 'జయిభవ' విజయవంతం..!
చరిత్ర తెలుసుకుంటే ఉత్తమ ఫలితం
సోషల్‌లో పట్టికలు, గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింటింగ్, సమాచార విశ్లేషణ సాధన చేయాలి. 1–12 ప్రశ్నల వరకు ఒక్కమాటలతో సమాధానం రాసే ప్రశ్నలున్నాయి. సబ్జెక్టుపై పట్టును సాధిస్తే సులువుగా ఆన్సర్ చేయవచ్చు. మ్యాప్ పాయింటింగ్‌లో ప్రశ్నలను విద్యా ప్రమాణాలను పరీక్షించేలా ఇస్తారు.
–ఆర్.వి.రమణ, ఎస్‌ఏ (సోషియల్), జెడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె
తెలుగు.. పట్టు సాధిస్తే ఫలితాలు మెరుగు
తెలుగులో రామాయణంపై అవగాహన కలిగి ఉండాలి. సంఘటనలను క్రమంగా అమర్చగలిగి ఉండాలి. కంఠస్థం చేయకుండా చదివి ఆలోచించడం, సృజనాత్మకత వల్ల ఉత్తమ మార్కులు పొందవచ్చు. పాఠ్యాంశంలోని స్టార్ గుర్తున్న పద్యాలను ఎక్కువ సార్లు రాసి సాధన చేయాలి.
–కృష్ణయ్య, తెలుగు ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె
Gurukul Schools: పేద విద్యార్థులకు గురుకులాల్లో నైపుణ్య విద్యతోపాలు పదిలమైన భవిష్యత్తు..!
అభ్యసనంతో హిందీలో రాణింపు
హిందీలో ఉత్తీర్ణతకు 20 మార్కులే ఉండటంతో భాషపై కొంత అవగాహన ఉంటే పాస్ కావొచ్చు. చదవడం, రాయడం, బాగా సాధన చేయాలి. రోజూ అరగంట హిందీకి కేటాయిస్తే 80 శాతం మార్కులు సాధించవచ్చు. వ్యాకరణ అంశాల మీద పట్టు సాధించాలి.
– ఎ.వసుధ, ఎస్‌ఏ(హిందీ), జెడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె
Boinapalli Vinod Kumar: ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి
జీవశాస్త్రాన్ని ఇష్టంగా చదవాలి
ఈ ఏడాది పీఎస్, బయాలజీ ఒకే పేపరు ఉంటుంది. పార్ట్–ఏ పీఎస్ 50, పార్ట్–బీ బయాలజీ 50 మార్కులకు ఉంటుంది. 17 నుంచి 33 వరకు బయాలజీ ప్రశ్నలుంటాయి. ప్రయోగాలు, భేదాలు, చిత్రపటాలు, టేబుల్స్‌పై అవగాహన ఉండాలి. చిత్రపటాలు, ప్రయోగశాల కృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
– ఎ.ఫణీంద్ర, ఎస్‌ఏ(బయాలజీ), జెడ్పీహెచ్‌ఎస్, మదనపల్లె