Boinapalli Vinod Kumar: ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మానసిక వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)లను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 20న తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 20 ఏళ్లుగా వీరు విద్యను అందిస్తున్నారని, చాలీచాలని వేతనంతో దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, అందుకు అవసరమైన పోస్టుల ను రెగ్యులర్ డీఎస్సీలో పొందుపర్చకుండా ఇతర ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
చదవండి: DMHO Dr. S. Bhaskara Rao: పారదర్శకంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 70 వేల వరకు చేరిందని, వీరందరికీ 996 మంది ఐఈఆర్పీలు బోధిస్తున్నారని, వీరిని రెగ్యులరైజ్ చేసి మిగిలిన పోస్టు లను డీఎస్సీలో భర్తీ చేయాలని సూచించారు.
చదవండి: Contract Professors: ‘వర్సిటీ’ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
Published date : 21 Feb 2024 04:09PM