Good News for Medical Workers: వైద్యారోగ్యశాఖలోని 16 వేలకుపైగా పోస్టుల గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో వైద్య విద్యాసంచాలకుల పరిధిలోని 16,024 పోస్టుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరిత ఏప్రిల్ 19న ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంఈ పరిధిలోని 4,013 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 9,684 ఔట్ సోర్సింగ్ పోస్టులు, గౌరవ వేతనం కింద ఉన్న 2,322 ఉద్యోగాల గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు.
చదవండి: Medical Students: ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్...ఇకపై సీట్లన్నీ స్థానికులకే... ఎక్కడంటే
ఇదిలా ఉండగా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతనం కింద ఉన్న పోస్టులకు ప్రతీ ఏడాదికి ఓసారి ప్రభుత్వం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది.
మార్చి 31కి ఆయా ఉద్యోగాలకు గడువు పూర్తవుతుంది. దీంతో తర్వాతి ఏడాదికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుంది. అయితే ఏప్రిల్ 1, 2 తేదీల్లో చేయాల్సిన రెన్యువల్‌ను ఏప్రిల్ 18వ తేదీకి చేశారు. దీని వలన జీతాలు ఆలస్యమవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
Published date : 20 Apr 2024 01:40PM