Contract Professors: ‘వర్సిటీ’ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగాల క్రమబద్ధీకరణతోనే విద్యావ్యవస్థ పటిష్టం అవుతుందన్నారు. సెప్టెంబర్ 6న కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుల ఆధ్వర్యంలో ‘సీఎం కేసీఆర్‌కు నివేదన’ పేరుతో సభ నిర్వహించారు.
చదవండి: JNTUKలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల భర్తీ
అనంతరం పరశురాం మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం.. వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను మాత్రం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్ర శ్నించారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో 1,445 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తు న్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కవితా తోరన్, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రా ష్ట్ర ఉపాధ్యక్షుడు నారా యణ గుప్తా, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
చదవండి: Best Teachers Awards: AU ఆచార్యులకు రాష్ట్ర స్థాయి అవార్డులు