Skip to main content

Anganwadi Jobs Interviews : అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు డివిజన్‌లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు శుక్రవారం పాడేరు సబ్‌కలెక్టర్‌ ధాత్రిరెడ్డి ఇంటర్వ్యూలు నిర్వహించారు.
Recruitment Process for Anganwadi Positions in Alluri Seetharamaraju District  anganwadi jobs 2024   Interview Session for Anganwadi Vacancies in Paderu Division

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు గాను ఐదుగురు, 18 అంగన్‌వాడీ హెల్పరఱ్‌ పోస్టులకు 15 మంది, ఎనిమిది మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు 8మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 

ap anganwadi jobs news telugu

వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఆమోదం నిమిత్తం కలెక్టర్‌ నివేదిక పంపుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. దరఖాస్తులు రాని ఒక అంగన్‌వాడీ కార్యకర్త, మూడు హెల్పర్‌ పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధులు మోహన్‌,సాయిరెడ్డి,పలు ప్రాజెక్టుల సీడీపీవోలు పాల్గొన్నారు.

మార్కుల ఆధారంగానే..

jobs news in ap

అలాగే చింతూరు డివిజన్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో కావూరి చైతన్య సమక్షంలో శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థులు 13 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో నియామకాలు చేపడతామని తెలిపారు. మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, సీడీపీవోలు విజయగౌరి, నాగలక్ష్మి, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Published date : 19 Feb 2024 11:02AM

Photo Stories