Skip to main content

Financial Assistance: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సాయం

నాంపల్లి: తెలంగాణ తెలుగు రచయితలకు తమ రచనలను ముద్రించుకోవడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయం అందజేస్తోంది.
Telugu Varsity financial assistance for printing of books  Funding Opportunity for Telugu Writers

తెలుగు భాష, సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతికి సంబంధించి సృజనాత్మక, పరిశోధనాత్మక, విమర్శనాత్మక రచనల ముద్రణ నిమిత్తం ఆర్థిక సహాయం కోసం తమ రచనలను పంపుకోవచ్చు.

ఇందుకు సంబంధించిన దరఖాస్తులను విశ్వవిద్యాలయంలోని విస్తరణ సేవా విభాగం నుంచి పొందవచ్చు. లేదా తెలుగు వర్శిటీ వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏదేనీ ముద్రణా సంస్థ నుంచి పొందిన ఒక కొటేషన్‌ను తీసుకుని దరఖాస్తుకు జతపరచాలి.

చదవండి: Text Books: స్కూలు పాఠ్య పుస్తకాల్లో మార్పులు.. ఈ పదాలు తొలగింపు!!

మే 31వ తేదీలోగా ఇన్‌చార్జి, విస్తరణ సేవా విభాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పరిపాలన భవనం, సాయినగర్, బాచుపల్లి ప్రాంగణం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా–500118 చిరునామకు పంపాలని రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Published date : 03 May 2024 12:14PM

Photo Stories