Tourism Courses: టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
హన్మకొండ: హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్)లో టూరిజం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత కళాశాల నిథమ్‌లో ఇంటర్, డిగ్రీలో బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్సులు పూర్తి చేసిన అనంతరం విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయని, దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు.
చదవండి: Most Dangerous Tourist Place: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏదో తెలుసా..?
జాతీయ స్థాయి విద్యా విధానంతో నిథమ్ ఉన్నత ప్రమాణాలతో కోర్సులు అందిస్తుందని పేర్కొన్నారు. అడ్మిషన్, ఇతర వివరాలకు హనుమకొండ కలెక్టరేట్‌లోని జిల్లా పర్యాటక శాఖ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని, లేదా పూర్తి వివరాలకు 94408 16076, 98669 19131 నంబర్‌లకు ఫోన్ చేయాలని సూచించారు.
Published date : 16 Apr 2024 05:16PM
Tags
- Tourism Courses
- National Institute of Tourism and Hospitality Management
- NITHM
- Department of Tourism and Culture
- Shivaji
- warangal news
- Telangana News
- Hanmakonda tourism
- District tourism department announcement
- Sivaji statement
- Admission applications
- Hyderabad tourism education opportunity
- Gachibowli education
- Tourism courses enrollment
- Neetham institute
- sakshieducation latest news