Skip to main content

Gurukul Schools: పేద విద్యార్థులకు గురుకులాల్లో నైపుణ్య విద్యతోపాలు పదిలమైన భవిష్యత్తు..!

‘నాడు–నేడు’ కార్యక్రమంతో మౌలిక వసతులు కల్పించారు. క్రమశిక్షణతో కూడిన విద్యే కాకుండా తగిన వసతులను అందించే చర్యలు, బాలికలకు అన్ని విధాలుగా సౌకర్యాలు, రక్షణ వసతలు ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు.. పూర్తి వివరాలను పరిశీలించండి..
West Narasapuram Girls Gurukula School

సాక్షి ఎడ్యుకేషన్‌: పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచితంగా ఆంగ్లమాధ్యమంలో విద్యనందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన నిరుపేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇందులో భాగంగా దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల (ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ)తో పాటు మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Jobs In Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

వెనుకబడిన తరగతుల విద్యార్థుల చదువుకు దన్నుగా నిలుస్తూ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ‘నాడు–నేడు’ కార్యక్రమంతో మౌలిక వసతులు కల్పించారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యాబోధన, రుచికరమైన భోజనం, ఆడపిల్లలకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుండడంతో ఏడాదికేడాది సీట్ల భర్తీకి డిమాండ్‌ పెరుగుతోంది. ఒక సీటుకు 15 మంది చొప్పున విద్యార్థులు పోటీ పడుతున్నారు.

BITS Pilani launches new PG Courses: బిట్స్ పిలానీలో సరికొత్త పీజీ కోర్సులు

మూడు బాలికలు, రెండు బాలుర పాఠశాలలు

జిల్లాలో మూడు బాలికలు, రెండు బాలుర గురుకుల పాఠశాలలున్నాయి. శింగనమల నియోజకవర్గం నార్పల, రాయదుర్గం నియోజకవర్గం గోనబావి, డి.హీరేహాల్‌లో బాలికలు, కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి, ఉరవకొండ నియోజకవర్గం కొనకొండ్లలో బాలుర పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 1,678 మంది విద్యార్థులు ఉన్నారు.

NAAC Committee: యూనివర్సిటీలో న్యాక్‌ బృందం మూడు రోజుల సందర్శన..!

వీరిలో 928 మంది బాలికలు, 750 మంది బాలురు ఉన్నారు. ప్రతి పాఠశాలలోనూ సీసీ కెమరాల పర్యవేక్షణలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలు రాత్రి 9 గంటల వరకూ విద్యార్థులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటోంది. రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ ఓ నర్సు, పీఈటీ, టీచర్‌, నైట్‌ వాచ్‌మన్‌ పర్యవేక్షణ ఉంటుంది.

School Holidays: రేపు పాఠశాలలకు సెలవు ఇచ్చే అవకాశం!.. కార‌ణం ఇదే..

నాణ్యమైన విద్య, బాలికలకు పూర్తి రక్షణ

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు.

Gurukul schools

గురుకులాల్లో ఎలాగైనా సీటు సంపాదించాలని తపనతో తమ పిల్లలను ప్రైవేటుగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుండడం గమనార్హం. సీటు వస్తే 5 నుంచి పదో తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో విద్యతోపాటు ఉచితంగా భోజన, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.

Students Education: పాఠశాల తనిఖీలో ఉపాధ్యాయులకు సూచన..!

5వ తరగతి నుంచే బ్రిడ్జి కోర్సు, ప్రాజెక్ట్‌ బేస్డ్‌ లర్నింగ్‌ వంటి అంశాలపై నిష్ణాతులైన టీచర్లు శిక్షణ ఇస్తున్నారు. 6, 7 తరగతుల విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ క్లాసులు నిర్వహిస్తూ వారిలోని నైపుణ్యాలను వెలికి తీస్తున్నారు. 8, 9 తరగతుల విద్యార్థులకు మైక్రో టెస్ట్‌, నెలవారీ పరీక్షలు, అసైన్‌మెంట్లు నిర్వహిస్తున్నారు. అంతేకాక ట్యాబ్‌ల ద్వారా బైజూస్‌ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 9వ తరగతి నుంచి ఆన్‌లైన్‌లో ఐఐటీ ఫౌండేషన్‌ శిక్షణ ఇస్తున్నారు.

Police Constable Training 2024- రెండు దశల్లో కానిస్టేబుల్‌ శిక్షణ, మొత్తం ఎంతమంది అంటే..

10వ తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు ఇంటెన్షివ్‌CM, మైక్రోటెస్ట్‌, అసైన్‌మెంట్స్‌, గ్రాండ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పిల్లల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆయా క్రీడల్లో రాణించేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు.

10th Class & 12th Class Exams: పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు... ఇక ఏడాదికి రెండుసార్లు

రూ.83 కోట్లతో పక్కా భవన నిర్మాణాలు

Gurukul schools

గురుకుల పాఠశాల విద్యను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదే స్థాయిలో గురుకులాలకు పక్కా భవనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో నార్పల పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ నిర్వహిస్తున్న ఈస్ట్‌ నరసాపురం బాలికల గురుకుల పాఠశాల గురించి ఆరా తీశారు. ఈస్ట్‌ నరసాపురంలో పక్కా భవనం లేకపోవడంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుసుకున్న ఆయన తక్షణమే పక్కా భవన నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు.

Intermediate Exams Time Table 2024- ఇంటర్‌ పరీక్షలు..నేటి నుంచి హాల్‌టికెట్ల జారీ

కళ్యాణదుర్గం పర్యటనలోనూ కుందుర్పిలోని గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రూ. 25 కోట్లు, ఉరవకొండ పర్యటనలో బాలికల పాఠశాల ఏర్పాటు, భవన నిర్మాణానికి రూ.33 కోట్లు కేటాయించారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.

APPSC group1 group2 Job for youth: యువతలో ఉద్యోగాల జోష్‌

5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ

2024–25 విద్యా సంవత్సరంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకూ https://mjpapbcwreis.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Gurukul schools

ఏప్రిల్‌ 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. కొనకొండ్ల బాలుర పాఠశాలలో పూర్తిస్థాయిలో వసతులు ఉండడంతో 80 సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన స్కూళ్లలో 40 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు.

Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

సీట్లకు డిమాండ్‌ పెరిగింది

నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుండడంతో బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో సీటుకు 15 మంది చొప్పున విద్యార్థులు పోటీ పడుతున్నారు. 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్‌ వచ్చింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తాం. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

– సంగీతకుమారి, బీసీ గురుకుల

పాఠశాలల జిల్లా కన్వీనర్‌

Published date : 21 Feb 2024 02:29PM

Photo Stories