Intermediate: 'జయిభవ' విజయవంతం..!
సాక్షి ఎడ్యుకేషన్: కళాశాలలో షెడ్యూలు ప్రకారం ‘జయీభవ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సిలబస్ పూర్తి కావడంతో రోజూ ఆయా పీరియడ్లలో చదివించి, వెంటనే పరీక్షలు రాయిస్తున్నాం. ముఖ్యమైన ప్రశ్నలు గుర్తించి చదివిస్తున్నాం. దీంతో పిల్లలు కూడా ఆసక్తిగా చదువుకుంటున్నారు. గతం కంటే కూడా ఫలితాలు మెరుగ్గా వచ్చే అవకాశం ఉంది.
– డొక్కా శంకరయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఆత్మకూరు
State SC and ST Commission: విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు
విజయవంతంగా అమలు
ఈసారి ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో మంచి ఫలితాల సాధనపై ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్‌గౌర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ‘జయీభవ’ 50 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 25 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈసారి కచ్చితంగా ఫలితాల శాతం పెరిగే అవకాశం ఉంది.
–వెంకటరమణనాయక్, ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్