State SC and ST Commission: విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు
సూర్యాపేట మండలంలోని ఇమాంపేట ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను ఫిబ్రవరి 20న కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చదువుపై ఏకగ్రాత పెంచుకోవాలన్నారు.
సమస్యలకు చావే శరణ్యం కాకూడదని, వాటిని టీచర్లకు, తల్లిదండ్రులకు తెలియజేసి పరిష్కరింపజేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు సావిత్రీబాయి, ఫాతీమా బేగంలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ ఏపీ టెన్త్ క్లాస్
భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు పైలెట్ ప్రాజెక్టుగా సైకియాట్రిస్టులచే తరగతులు నిర్వహించేలా, రెండు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం అందేలా ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేస్తుందన్నారు. ముందుగా ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశమై జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైష్ణవి, అస్మితల తోటి స్నేహితుతో మాట్లాడారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని, స్నేహపూర్వకంగా వారిని ప్రోత్సహించాలన్నారు. వైష్ణవి ఇంటికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అస్మిత కుటుంబ సభ్యులను కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్చారు.