Skip to main content

KGBV Recruitments: కేజీబీవీకి భారీగా దరఖాస్తులు.. ఖాళీలు ఇవే

KGBV Recruitments  Applicants waiting for job interviews for cooking and cleaning positions at KGBV  Notice about retirement age rule being implemented for contract workers at KGBV. Job application forms for cooking and cleaning positions at KGBV in Pachalanadkuda

వేల్పూర్‌: మండలంలోని పచ్చలనడ్కుడ శివారులో ఉన్న కేజీబీవీలో వంట పని, గదులు శుభ్రపరిచే పనులకు భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 50 మందికి పైగా మంది దరఖాస్తు చేసుకోవడంతో పోటీ నెలకొంది. రాష్ట్రప్రభుత్వ ఉ ద్యోగులకు పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ల నిబంధన ఉండడంతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి అదే నిబంధనను అమలు చేస్తున్నారు.

Increase In Fees: దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఫీజులు.. ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు ఫీజులు పెంపు

దీంతో ఇక్కడి కేజీబీవీలో హెడ్‌ కుక్‌, ఇద్దరు అసిస్టెంట్‌ కుక్‌లు, ఒక స్వీపర్‌ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. వీరి స్థానంలో కొత్తవారిని నియమించడానికి ఈనెల 18 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. హెడ్‌ కుక్‌కు పదోతరగతి, అసిస్టెంట్‌ కుక్‌, స్వీపర్‌కు ఏడోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని నిబంధన విధించారు.

వీరికి ఒక్కొక్కరికి సుమారు రూ. 9,750 వేతనం ఇ వ్వనున్నారు. కేజీబీవీ ప్రభుత్వానిది కావడంతో ఒ క్కసారి చేరితే శాశ్వతంగా ఉండొచ్చనే అభిప్రాయంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర చోట్ల వేతనం, పనులు సక్రమంగా లభించకపోవడంతో ఈ పోస్టులకు డిమాండ్‌ ఏర్పడింది.
 

Published date : 22 Jul 2024 01:04PM

Photo Stories