Hanumanthu: పోలీసులకు చుక్కలు చూపించిన బుడతడు
ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరగ్గా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దకడబూరు గ్రామానికి చెందిన వీరనాగుడు కుమారుడు హనుమంతు ఓ ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందన నాగప్ప కుమారుడు హనుమంతు 3వ తరగతి చదువుతున్నాడు. ఎదురెదురు ఇళ్లు కావడంతో వీరు రోజూ సాయంత్రం కలిసి హోంవర్క్ చేసుకునేవారు. వీరనాగుడు కొడుకు హనుమంతు పోలీస్‌స్టేషన్ కు వెళ్లాడు. ఎందుకు వచ్చావని పోలీస్‌లు విద్యార్థిని ప్రశ్నించగా..‘నా పెన్సిల్ పోయింది. అపహరించింది నా ఫ్రెండే.. వాడిపై కేసు నమోదు చేయండి’ అని కోరాడు. కేసు నమోదు చేయకపోతే ఊరుకునేది లేదు అని మారాం చేయడంతో..సరే నీవు చెప్పినట్లు కేసు నమోదు చేస్తాంలే అని పోలీసులు బుడతడికి చెప్పారు. దీంతో హనుమంతు వెళ్లిపోయాడు. ఈ వీడియో వీపరీతంగా హల్‌చల్ చేస్తుండటంతో డీజీపీ కార్యాలయం స్పందించింది. ‘ఏదైనా వస్తువు పోతే పోలీస్‌స్టేషన్ కు వెళ్లాలి అన్న ఆలోచన మూడో తరగతి విద్యార్థికి తట్టడం నిజంగా ఆశ్చర్యకరం’ అంటూ పేర్కొంది. హనుమంతుతో స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాసులు మాట్లాడిన తీరును ప్రశంసించింది.
చదవండి:
MLHP: ఎంఎల్‌హెచ్‌పీలకు కౌన్సెలింగ్
Jagananna Vidya Deevena: తీర్పును పునఃసమీక్షించండి
Justice Durga Prasad Rao: న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు విపరీతమైన డిమాండ్