Sr IAS Smita Sabharwal : సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాక్యలపై తీవ్ర ఆగ్రహం.. ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్..
హైదరాబాద్: ‘వైకల్యం కలిగిన పైలట్‌ను ఏదైనా విమానయాన సంస్థ ఉద్యోగంలో తీసుకుంటుందా? వైకల్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణుడిపై మీరు నమ్మకం ఉంచుతారా? మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సేవల (ఏఐఎస్) (ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్‌ఎస్ తదితర) ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?’అని సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ‘ఎక్స్’వేదికగా ఆదివారం ప్రశ్నించారు. ఉద్యోగ స్వభావ రీత్యా అఖిలభారత సేవల అధికారులు క్షేత్రస్థాయిలో గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల విన్నపాలను నేరుగా వింటూ పనిచేయాల్సి ఉంటుందని, దీనికి శారీరక ఆరోగ్యం అవసరమని స్పష్టం చేశారు.
Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్.. సీటు వస్తే ఏడేళ్ల పాటు ఉచితంగా విద్యాబోధన
స్మితా వ్యాఖ్యలు సరికాదు..
వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, మేధోశక్తిపై ప్రభావం చూపవని సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ, బ్యూరోక్రాట్లు తమ సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వారికి క్షమాపణ చెప్పాలని, వికలాంగుల కమిషన్ ఆమెపై కేసు నమోదు చేయాలని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కన్వీనర్ నారా నాగేశ్వరరావు ఆదివారం ప్రకటనలో వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్‌లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్‌అండ్‌డీ, డెస్క్ జాబ్‌లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె‘ఎక్స్’వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
Sohanvika: బంగారు పతకం సాధించిన తొమ్మిదేళ్ల ఏపీ బాలిక.. ఎందులో అంటే..
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
తాజాగా.. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేసినా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమి నిర్వాహకురాలు, మెంటర్, కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
‘‘ స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ముట్టడిస్తాం. దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచన లేదా.. ఆమె మాటలా?. ఆమె మెంటల్‌గా అప్‌సెట్ అయ్యారు. తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు.
IT Sector: ఐటీ రంగం పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
ప్రభుత్వం స్పందించాలి..
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలి. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారామె. ఇప్పటికే నాతో చాలా విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి. మాకు న్యాయం జరగాలి’’ అని అన్నారు.
మరోపైపు.. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ‘ఎక్స్’ వేదికగానే స్పందించారు. ఐపీఎస్/ ఐఎఫ్‌ఒఎస్‌తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్, ఐఎఫ్‌ఒఎస్ లాగే ఐఏఎస్‌లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. సున్నితత్వానికి నా మనసులో స్థానం లేదని పేర్కొన్నారు.
Tags
- tweet
- disabled persons
- Sr IAS Smita Sabharwal
- Police case
- physically handicapped
- Reservation
- Civil Service Exam
- Competitive Exams
- UPSC
- case on ias smita sabharwal
- Education News
- Sakshi Education News
- Smita Sabharwal
- IAS Officer
- Disabled people
- Controversial tweet
- Netizens reaction
- Inappropriate comments
- IAS academy
- Balalatha
- Resignation demand
- Justice for disabled