IIT JAM 2025 Notification : ఐఐటీ జామ్–2025 షెడ్యూల్ విడుదల.. పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో ప్రవేశాలు..
ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీస్)లకు ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యాబోధనలో అంతర్జాతీయ గుర్తింపు! అందుకే ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశం కోసం ఏటా లక్షల మంది పోటీపడుతుంటారు. కాని సీట్ల పరిమితి కారణంగా కొంతమందికే అడ్మిషన్ లభిస్తుంది. బ్యాచిలర్ స్థాయిలో నిరాశకు గురైన వారు.. పీజీ స్థాయిలో తమ ఐఐటీ కల సాకారం చేసుకోవచ్చు. అందుకు మార్గం.. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)! తాజాగా 2025–26 ప్రవేశాలకు సంబంధించి ఐఐటీ జామ్ –2025 షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఐఐటీ జామ్ వివరాలు, పరీక్ష విధానం, జామ్ స్కోర్‌తో ప్రవేశం లభించే కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు తదితర సమాచారం..
ఐఐటీలు బ్యాచిలర్ నుంచి పీజీ వరకు పలు స్థాయిల్లో ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇందుకోసం నిర్వహించే ఎంట్రన్స్‌లలో జామ్ ప్రత్యేకమైన టెస్ట్. పీజీ స్థాయిలో సైన్స్ కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది.
ML Engineering Posts : హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజనీర్ పోస్టులు.. అర్హులు వీరే!
ఆరు కోర్సులు.. 2987 సీట్లు
ఐఐటీ జామ్ స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా 21 ఐఐటీ క్యాంపస్‌లలో.. పీజీ స్థాయిలో ఆరు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అవి.. ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్నాలజీ); ఎంఎస్ (రీసెర్చ్); ఎమ్మెస్సీ–ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ, జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ; ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్. మొత్తం 2,987 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా 5.5 సీజీపీఏ ఉండాలి. 2025లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
JNST Notification 2025 : జవహర్ నవోదయ సెలక్షన్ టెస్ట్–2025 నోటిఫికేషన్ విడుదల..
ఆన్‌లైన్‌లో జామ్
ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎమ్మెస్సీ తదితర సైన్స్ కోర్సుల్లో ప్రవేశానికి జామ్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.మొత్తం ఏడు పేపర్లలో పరీక్ష జరుగుతుంది. అవి.. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లలో పరీక్షకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.
మూడు విభాగాల్లో జామ్
జామ్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. అవి..
➤ సెక్షన్–ఎ: 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఇందులో 1 మార్కు ప్రశ్నలు 10, 2 మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు.
➤ సెక్షన్–బి: ఈ విభాగంలో 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్‌క్యూ) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
➤ సెక్షన్–సి: ఈ విభాగంలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు, 10 ప్రశ్నలకు 2 మార్కులు కేటాయిస్తారు.
➤ ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు 60 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్‌క్యూ, ఎన్‌ఏటీ విభాగాల్లో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
Agnivir Vayu Recruitment 2024: అగ్నివీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే
ఆన్‌లైన్ కౌన్సెలింగ్
ఐఐటీ జామ్ స్కోర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తాయి. అభ్యర్థులు ఐఐటీల్లో సీట్ల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(జేఓఏపీఎస్)ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో తమ లాగిన్ ఐడీæ క్రియేట్ చేసుకుని.. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు పొందిన స్కోర్, వారు పేర్కొన్న ప్రాథమ్యాలను బేరీజు వేసి ఆన్‌లైన్‌లోనే సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో ఉంటుంది.
మరెన్నో ఇన్‌స్టిట్యూట్స్
ఐఐటీ జామ్ స్కోర్‌ను ఐఐటీలతో పాటు మరెన్నో ఇన్‌సిట్యూట్స్ కూడా పీజీ ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఎన్‌ఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఈఎస్‌టీ, ఐఐఎస్‌ఈఆర్(పుణె, భోపాల్), ఐఐపీఈ, జేఎన్‌ఎస్‌ఏఆర్, ఎస్‌ఎల్‌ఐఈటీ, డీఐఏటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ తదితర మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
Budget 2024-25: కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల.. ముఖ్యాంశాలు ఇవే..
ముఖ్య సమాచారం
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2024, సెప్టెంబర్ 3– అక్టోబర్ 11
➤ జామ్ పరీక్ష తేదీ: 2025, ఫిబ్రవరి 2
➤ ఫలితాల వెల్లడి: 2025, మార్చి 16
➤ ఆన్‌లైన్ అడ్మిషన్ పోర్టల్: 2025, ఏప్రిల్ 2 నుంచి
➤ వెబ్‌సైట్: https:// jam2025.iitd.ac.in/index.php
బెస్ట్ స్కోర్ సాధించాలంటే
ఐఐటీలో పీజీ స్థాయిలో అడుగు పెట్టేందుకు మార్గం వేసే జామ్‌లో బెస్ట్ స్కోర్ సాధించడానికి.. అభ్యర్థులు సబ్జెక్ట్/పేపర్ వారీగా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
UPSC Story of Karthik Kansal : యూపీఎస్సీలో నాలుగు ప్రయత్నాలతో అర్హత సాధించినా ఉద్యోగం దక్కలేదు.. కార్తీక్ కన్సాల్ స్టోరీ ఇదే!
బయోటెక్నాలజీ
అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్‌ను అభ్యసనం చేయాలి. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది.
ఎకనామిక్స్
మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి.
TSRTC 10000 Jobs Details 2024 : ఆర్టీసీలో 10000 ఉద్యోగాలు.. భర్తీ చేస్తాం ఇలా..!
జియాలజీ
ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలపై దృష్టి పెట్టాలి.
మ్యాథమెటిక్స్
సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్‌జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి.
మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్
మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్‌లో.. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపో థీసిస్‌లను అధ్యయనం చేయాలి.
DSC Free Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ట్రైనింగ్, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
ఫిజిక్స్
మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి.
కెమిస్ట్రీ
బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్ప›్ష న్,స్పెక్ట్రోమెట్రి; ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్, క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీపై దృష్టి పెట్టాలి.
అకడమిక్స్‌పై పట్టు
జామ్‌లో బెస్ట్ స్కోర్ కోసం అభ్యర్థులు బ్యాచిలర్ స్థాయి అకడమిక్స్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా జామ్ పాత ప్రశ్న పత్రాలు, గేట్ సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించిన పాత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ చేయాలి.
బేసిక్ కాన్సెప్ట్స్‌పై అవగాహనతోపాటు, అప్లికేషన్ అప్రోచ్ పెంచుకోవాలి. అప్పుడే పరీక్ష హాల్లో ప్రశ్నను ఏ విధంగా అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
RGUKT- idupulapaya Campus admissions 2024: నేటి నుంచి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ
Tags
- IIT JAM Notification 2025
- online applications
- Engineering courses
- admissions
- Best score tips for IIT JAM
- institutes for engineering
- IIT JAM Score
- Online Counselling
- three sessions
- online exam
- B Tech Admissions
- Education News
- Eligible students
- pg and p hd courses
- IITJAM2025
- IITJAMSchedule
- IITJAMAdmissions
- IITJAMExamDates
- IITJAMProcedure
- IITJAMAdmissionProcess
- IITJAMImportantDates
- IITJAMTimetable
- IITJAMUpdates
- JAMScore2025
- IITJAM2025Details
- IITJAMInstitutes
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024