Engineering and Medical Course Admissions : ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల సమయం.. ఆసక్తికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటున్న నిపుణులు
ఇందుకోసం సంబంధిత ఎంట్రన్స్‌లకు లక్షల మంది విద్యార్థులు హాజరై.. ఉత్తీర్ణత సాధించిన పరిస్థితి! అదే సమయంలో తాము సాధించిన ర్యాంకుకు.. నచ్చిన కోర్సులో, కాలేజీలో సీటు వస్తుందో లేదో అనే సందేహం! ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో ఎన్నో బ్రాంచ్‌లు, వందల సంఖ్యలో కాలేజీలు!! ఈ నేపథ్యంలో.. ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థులు కోర్సు, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..
SSC-CGL 2024 : వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
కోర్సు, కాలేజ్ ఎంపికలో ముందుగా కోర్సు/బ్రాంచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు తమ ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. కేవలం క్రేజ్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకుంటే.. అకడమిక్‌గా రాణించలేకపోవచ్చు. ఇది భవిష్యత్తు గమ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారముంది. కాబట్టి బ్రాంచ్ ఎంపికలో అందుబాటులో ఉన్న బ్రాంచ్‌ల సిలబస్,కరిక్యులం స్వరూపాన్ని పరిశీలించి తమ సహజ ఆసక్తికి అనుగుణంగా ఉండే బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి.
Senior Resident Posts at RMLH : ఆర్‌ఎంఎల్‌హెచ్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
ఇన్‌స్టిట్యూట్ కీలకమే
ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఇన్‌స్టిట్యూట్ ఎంపిక కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలి. ఈఏపీసెట్ ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంజనీరింగ్ కోర్సుల్లో దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. కానీ.. పేరున్న కాలేజీలో చేరితే నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన ప్లేస్‌మెంట్స్ అవకాశాలు అందుకునే వీలుంటుంది.
నిబంధనలు పాటిస్తున్నాయా
ఇన్‌స్టిట్యూట్ ఎంపికలో విద్యార్థులు.. సదరు ఇన్‌స్టిట్యూట్స్ ఏఐసీటీఈ నిబంధనలను పాటిస్తున్నాయా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలించాలి. కరిక్యులం, ఫ్యాకల్టీ, ల్యాబ్ సౌకర్యంæ వంటి కీలక అంశాలు మొదలు.. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకూ.. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా లేదో గమనించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాలలను పరిశీలించి సదరు సమాచారం తెలుసుకోవాలి.
M Tech Admissions : డిగ్రీ విద్యార్థులకు విశాఖపట్నం ఐఐపీఈలో ఎంటెక్ కోర్సులకు దరఖాస్తులు..
ఎన్‌బీఏ గుర్తింపు
ఆసక్తి ఉన్న బ్రాంచ్ విషయంలో సదరు ఇన్‌స్టిట్యూట్‌కు ఎన్‌బీఏ గుర్తింపు ఉందా? లేదా? అనే విషయం కూడా పరిగణించాలి. కారణం.. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్ వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు మొత్తం బ్రాంచ్‌లలో ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్ అని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కాలేజ్.. ఇమేజ్
విద్యార్థులు కాలేజ్ ఎంపికలో పరిగణించాల్సిన మరో విషయం.. కాలేజ్‌కు ఉన్న గుర్తింపు. ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్‌స్టిట్యూట్‌కు ఎలాంటి గుర్తింపు ఉందో తెలుసుకోవడం మేలు చేస్తుంది. ఇందుకోసం విద్యార్థులకు ఉపకరించే సాధనం గత ఏడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీలో ఓపెనింగ్–క్లోజింగ్ ర్యాంకుల వివరాలు. ఉదాహరణకు ఓయూసీఈ, ఏయూసీఈ వంటి యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదే విధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే.. ఆ కళాశాలలు అనుసరిస్తున్న ప్రమాణాలు, ఇండస్ట్రీలో ఉన్న పేరు, ప్లేస్‌మెంట్స్ ఆధారంగా టాప్ ర్యాంకర్ల ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు.
B Tech Course Admissions : ఐఐపీఈలో నాలుగేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
బోధన విధానాలు
విద్యార్థులు కాలేజ్ ఎంపికలో బోధన పద్ధతుల విషయంలోనూ దృష్టి పెట్టాలి. ఒక కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ.. టీచింగ్ విధానంలో లోపాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి. టీచింగ్ పరంగా అనుసరిస్తున్న విధానం,ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఉన్నారని ప్రకటనలిస్తుంటాయి. ఫ్యాకల్టీ అర్హతలతోపాటు క్లాస్ రూంలో స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్, సందేహాల నివృత్తి వంటివి కూడా తెలుసుకోవాలి.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
బీటెక్ కోర్సులో చేరే లక్ష్యం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేది నిస్సందేహం. నాలుగేళ్ల బీటెక్ కోర్సులో చేరే ప్రతి విద్యార్థి ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకోవడం. కాబట్టి కళాశాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్ రికార్డ్స్.. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి. వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోవాలి.
TS 10th Class Supplementary Exams 2024 Results : నేడే టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 విడుదల.. రిజల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
నచ్చిన కాలేజీలో సీటు రాకుంటే
నచ్చిన కాలేజ్‌లో సీటు రాకుంటే ఏం చేయాలి? అనే ప్రశ్న ఎక్కువ మంది విద్యార్థులకు ఎదురవుతుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్‌లో విద్యార్థి ఎంపిక చేసుకున్న కళాశాలలో ప్రవేశం దక్కకపోవచ్చు. అందుకు విద్యార్థులు ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండాలి. మెచ్చిన కాలేజ్‌లో సీటు రాకపోయినా.. అకడమిక్‌గా రాణించేందుకు స్వయం కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ–లెర్నింగ్ పోర్టల్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్‌లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లేబొరేటరీ వంటి సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమను తాము తీర్చిదిద్దుకోవాలి.
మెడిసిన్‌లోనూ.. అప్రమత్తంగా
ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడిసిన్ కోర్సుల అభ్యర్థులు సైతం కాలేజీ, కోర్సు ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రస్తుతం తమకు వచ్చిన ర్యాంకు.. గత ఏడాది అదే ర్యాంకుకు సీట్లు ఖరారైన ఇన్‌స్టిట్యూట్‌లను గుర్తించాలి. అలా గుర్తించిన ఇన్‌స్టిట్యూట్స్‌లో.. పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ల జాబితా సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం.. హెల్త్ యూనివర్సిటీలు విడుదల చేసే ల్యాస్ట్ ర్యాంక్స్ గణాంకాలను పరిశీలించాలి. తాము ప్రస్తుతం పొందిన ర్యాంకు.. గత ఏడాది ఆయా ఇన్‌స్టిట్యూట్స్, కోర్సులలో సీట్లు లభించిన లాస్ట్ ర్యాంక్‌లను గుర్తించి.. కళాశాలలు, కోర్సుల ఎంపిక కసరత్తు చేయాలి.
NEET UG 2024 Paper Leak Issues : నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమన్నారంటే..
ఆల్ ఇండియా కోటా
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా కోటా విధానం అమల్లో ఉంది. దీని ద్వారా నీట్ ఉత్తీర్ణులు ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో 15 శాతం సీట్లకు పోటీ పడే అవకాశం ఉంది. ఈ కోటాలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు.. ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ఇన్‌స్టిట్యూట్స్, వాటి ప్రామాణికతను పరిశీలించాలి. దాని ఆధారంగా..ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఒకవేళ తొలి దశలో తమకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రాకున్నా.. మలి దశ కౌన్సెలింగ్‌లో అవకాశం దక్కించుకునేలా ప్రయత్నించాలి.
ప్రత్యామ్నాయాలకు సిద్ధంగా
బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్ విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీటు రాకుంటే.. ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు..బీటెక్ విద్యార్థుల్లో అధిక శాతం మంది సీఎస్‌ఈకి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఈ బ్రాంచ్‌లో సీటు రాకపోతే.. ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పుడు పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో సీఎస్‌ఈలోనే ఏఐ–ఎంఎల్ బ్రాంచ్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నారు. కాబట్టి సీఎస్‌ఈ రాకపోయినా.. ఏఐ–ఎంఎల్ కోర్సుల్లో చేరొచ్చు. అదేవిధంగా మెడిసిన్‌కు సంబంధించి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ లభించకుంటే.. బీడీఎస్‌లో చేరొచ్చు. ఒకవేళ ఈ రెండు కోర్సుల్లోనూ సీటు లభించకపోతే.. ప్రత్యామ్నాయంగా ఉన్న ఆయుష్ కోర్సులపై దృష్టి సారించొచ్చు. బైపీసీ విద్యార్థులకు అగ్రికల్చర్ కోర్సులు కూడా చక్కటి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ప్రత్యామ్నాయ కోర్సులను ఎంచుకోవచ్చు.
AP DSC 2024 Updates : డీఎస్సీ-2024.. జిల్లాల్లోని 80% స్థానికులకే టీచర్ పోస్టులు..?
ఆసక్తికి ప్రాధాన్యం
వందల సంఖ్యలో ఇన్‌స్టిట్యూట్స్, కోర్సులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందుగా తమ ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిపుణుల అభిప్రాయం. ఆసక్తికి భిన్నంగా ఇతరుల ఒత్తిడితో ఇష్టంలేని కోర్సులో చేరితే.. అది భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు.. బోధన పద్ధతులు పాటించే ఇన్‌స్టిట్యూట్‌లో తమకు నచ్చిన బ్రాంచ్‌లో చేరడం మేలంటున్నారు. ఆ తర్వాత స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
Free Education: ‘చదువుకునే వారికి చదువు‘కొనే’ అవసరం లేదంటూ’.. ప్రభుత్వ కాలేజీ ‘ఫ్లెక్సీ’
Tags
- engineering colleges
- admissions
- admissions notifications
- Medical Colleges
- new academic year
- various courses
- Professional Courses
- b tech courses admissions
- medical courses admissions
- NBA Accredit
- Education News
- Sakshi Education News
- Engineering career guidance
- Engineering education quality
- Financial planning for education
- Course selection tips
- sakshieducationlatest news