టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్‌పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు.
చదవండి: Intermediate New Syllabus:2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్
నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన టీచర్‌ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్‌ను చితకబాదారు.