Pushpa 2 Movie: ‘పుష్ప–2’ సినిమాకెళ్తా.. సెలవివ్వండి
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: ఊరూవాడా పుష్ప–2 సినిమా చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర అభిమానులు బారులుదీరారు.
మరోవైపు పాఠశాలలపైనా ఈ ప్రభావం పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.. సినిమా చూసేందుకు సెలవు మంజూరు చేయమని ఏకంగా ప్రిన్సిపాల్, తరగతి ఉపాధ్యాయుడికి.. లేఖ రాశాడు. ‘ఈ రోజు నా ఫేవరెట్ హీరో సినిమా పుష్ప–2 విడుదల అయింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
నేను సినిమాకు వెళ్తాను.. సార్.. ప్లీజ్ ఈ రోజు సెలవు ఇవ్వాలని కోరుతున్నాను’.. అంటూ ఆ విద్యార్థి రాసిన సెలవు దరఖాస్తు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వైరలవుతోంది. ఆ లీవ్‌లెటర్‌కు చాలామంది లైక్‌లు కొడుతున్నారు.
Published date : 07 Dec 2024 09:27AM