Skip to main content

న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు విపరీతమైన డిమాండ్‌

ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం మహోన్నతమైనదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గా ప్రసాద్‌రావు అన్నారు.
Durga Prasad Rao
మాట్లాడుతున్న జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌రావు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ లా డే ను పురస్కరించుకుని నవంబర్‌ 25న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌రావు మాట్లాడుతూ..లా విద్యార్థులు ప్రతి రోజు కొత్త విషయాలను, సరికొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. భారత పౌరులు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కాపాడేందుకు హక్కులను రాజ్యాంగంలో పొందుపరచి వీటి పరిరక్షణ బాధ్యతలను కోర్టులకు అప్పగించిందన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ..న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగిందని చెప్పారు.

చదవండి: 

LAWCET: కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..

2022లో రెండు CLAT పరీక్షలు: జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్‌ సాగించండిలా.. !

First Gay Judge: హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్న తొలి స్వలింగ సంపర్కుడు?

Published date : 26 Nov 2021 03:09PM

Photo Stories