Women DSP Success Story : ఈ లక్ష్యం కోసమే.. ఆ జాబ్ వదులుకున్నా.. అనుకున్నట్టే డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..
ఆదాయపు పన్నుశాఖలో వచ్చిన హ్యాపీ జాబ్‌ని వదిలేసి తాత, తండ్రి చేస్తున్న పోలీస్‌శాఖలోనే వారి కంటే పెద్ద పోస్టులో జాయిన్ అయ్యారు. ఈ మహిళ అధికారిణే ప్రియా సింగ్. ఈ నేపథ్యంలో ప్రియా సింగ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
మా ఇంట్లోనే.. నాకు..
జీవితంలో ఎవరికైనా ఎదగడానికి చుట్టు పక్కల ఉన్న వాళ్లు ఆదర్శప్రాయులు అవుతారు. కానీ ఈమెకు మాత్రం ఇంట్లోనే పోలీస్‌శాఖలో పని చేసిన తండ్రి, తాతలను చూసిన.. పట్టుదలతో అతిపిన్న వయసులోనే అదే పోలీస్‌శాఖలో తాత, తండ్రి కంటే గొప్ప ఉద్యోగం సంపాదించి అందరికి రోల్ మోడల్‌గా నిలిచింది ప్రియా సింగ్.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని మానసరోవర్ కాలనీకి చెందిన ప్రియా సింగ్ డీఎస్పీగా కాన్పూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈమె 2018 బ్యాచ్ PPS. ఈమె తండ్రి మథురలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రియాసింగ్ తాత కూడా పోలీస్‌శాఖలో ఎస్‌హెచ్‌ఓగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
చదువులో ఎప్పుడూ ఫస్ట్.. కానీ..
ప్రియా సింగ్.. చదువులో ఎప్పుడూ ఫస్ట్ క్లాసు విద్యార్థినే. బరేలీలో పాఠశాల విద్యను పూర్తి చేసి తర్వాత మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీలో బీఎస్సీని పూర్తి చేశారు. పీజీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేసి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు ప్రియాసింగ్. అలాగే గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు.
కఠినమైన పరీక్షలో రెండుసార్లు అర్హత సాధించడం అంటే..
ప్రియాసింగ్.. PCS వంటి కఠినమైన పరీక్షలో రెండుసార్లు అర్హత సాధించడం అంటే అంత తెలికైన పనికాదు. కానీ ఆమె మాత్రం ఎంత చాలా తెలివిగా రెండు సార్లు PCS వంటి కఠినమైన పరీక్షలో అర్హత సాధించారు. తన మొదటి ప్రయత్నంలోనే 2017 సంవత్సరంలో UP PCS పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం సంపాదించారు. అయితే మళ్లీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు.
2018లో మళ్లీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఈసారి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు ప్రియాసింగ్. ఈ పరీక్షల ప్రిపరేషన్ కోసం తాను తేలికగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. అందుకే గతంలో కంటే ఎక్కువ స్కోర్ చేయడం సాధ్యమైందన్నారు. సాధించాలనే పట్టుదల.. తపన ఉంటే.. విజయం సాధించడం ఈజీనే అంటున్నారు ప్రియాసింగ్.
☛ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి