Collector P Ranjit Basha: ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌

బాపట్ల: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అక్టోబ‌ర్ 19న‌ పేర్కొన్నారు.
ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌

బాపట్ల కలెక్టరేట్‌లో అక్టోబ‌ర్ 20న‌ మధ్యాహ్నం 12 గంటలకు గ్రీవెన్స్‌ ప్రారంభమవుతుందని వివరించారు. వినతిపత్రాల ద్వారా తమ సమస్యలు నేరుగా విన్నవించుకునే అవకాశం కల్పించామన్నారు. ఉద్యోగులు ఎవరైనా ధైర్యంగా తమ సమస్యలు విన్నవించుకోవచ్చన్నారు. గ్రీవెన్స్‌సెల్‌కు రాదలచిన ఉద్యోగులకు అనుమతులు ఇవ్వాలని, వారిని ఆటంకపరచరాదని అన్ని శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లా అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.

చదవండి: Success Story: ప‌లు ప్ర‌య‌త్నాల‌తో సివిల్స్ లో గెలుపు

ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ ను ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతినెలా 3వ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమం తప్పనిసరిగా కలెక్టరేట్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చిన ప్రతి అర్జీనీ ప్రత్యేక పోర్టల్‌లో నిక్షిప్తం చేసి వారికి తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

#Tags