Union Bank Recruitment 2024: యూనియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభ‌వార్త‌.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన వారికి నెల‌కు రూ.89000 కంటే ఎక్కువ జీతం ఉంటుంది. 

మొత్తం పోస్టులు : 606

అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ,  సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థులను ఎంపిక చేస్తారు. 

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్), మేనేజర్ (లా) త‌దిత‌ర పోస్టులు ఉన్నాయి. 

Railway Jobs: 2024లో రైల్వేలో భారీ ఉద్యోగాలు.. జాబ్‌ క్యాలెండర్‌ ఇదే..

విభాగాలు : సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్, ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్, ఎజైల్ మెథడాలజీస్ స్పెషలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, డీఎస్‌వో ఇంజినీర్ త‌దిత‌రాలు 

వయో పరిమితి: పోస్టులకు సంబంధించి వయో పరిమితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 
ధ‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ: ఫిబ్ర‌వ‌రి 23, 2024

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 ఉంటుంది.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ : https://www.unionbankofindia.co.in/ లేదా https://ibpsonline.ibps.in/ubisojan24/ను సంప్రదించండి.

 

#Tags