Skip to main content

TS DSC 2024 Exam Updates : నత్తనడకన మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ.. త్వరలోనే షెడ్యూల్‌ విడుదల

Application Process for 11,062 Teacher Posts Started on March 4th  TS DSC 2024 Exam Updates   Mega DSC Application Process   Schedule for DSC Exams in July Coming Soon

మెగా డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు కొత్తగా 43వేల మంది అప్లై చేసుకోగా.. ఓవరాల్‌గా 2.21 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి.

జులైలో జరిగే డీఎస్సీ పరీక్షల పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

జూన్‌ 20 వరకు అప్లై చేసేందుకు అవకాశం కల్పించారు. 2023లో రిలీజ్‌ చేసిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వాళ్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా గురువారం నాటికి 46వేల మంది ఫీజు చెల్లించగా, 43,882 మంది అప్లై చేసుకున్నారు. గతంలో 1, 77, 523 మంది అప్లై చేశారు. దీంతో ఇప్పటి వరకు 2, 21, 405 మంది దరఖాస్తు చేసినట్లయింది. 

త్వరలోనే డీఎస్సీ షెడ్యూల్‌
విద్యాశాఖ త్వరలోనే డీఎస్సీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ షెడ్యూల్‌ను రిలీజ్‌ చేయనుంది. ఇందుకు ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జులై 17 నుంచి 31 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. 

Published date : 11 May 2024 04:29PM

Photo Stories