Job Mela: గిరిజన యువతకు జాబ్‌ మేళా

నిరుద్యోగ యువతకు బుధవారం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జేఆర్పీ ముకుంద్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఉండాల్సిన అర్హతలు, తదితర వివరాలను వెల్లడించారు..

ఇచ్చోడ: ఈ నెల 13న ఉట్నూర్‌లో గిరిజన నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జేఆర్పీ ముకుంద్‌ తెలిపారు. ఉదయం 11గంటలకు ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో ఐటీడీఏ పీవో ఖుష్భూగుప్తా ఆధ్వర్యంలో మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆసక్తి గల గిరిజన నిరుద్యోగ యువతి, యువకులు విద్యార్హత, కుల ధ్రువీకరణ జిరాక్స్‌ పత్రాలతో హాజరు కావాలని కోరారు.

International Conference: అంతర్జాతీయ హిందీ సమ్మేళనం

18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఈ ఉద్యోగ మేళాకు హైదరాబాద్‌లోని 15 ప్రైవేట్‌ కంపెనీల ప్రతినిధులు హాజరై వెయ్యి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

#Tags