Andhra Pradesh Jobs: 21న వైజాగ్ లో మెగా జాబ్‌మేళా... వివిధ కంపెనీల్లో 455 ఖాళీలు!

455 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

కంచరపాలెం: జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో క్లరికల్‌, టెక్నికల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారులు సీహెచ్‌ సుబ్బిరెడ్డి (క్లరికల్‌), కె.శాంతి (టెక్నికల్‌) తెలిపారు.

250 posts in Vizag Steel Plant: ఈ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు .. ఎంపిక విధానం ఇలా‌..

టెక్నో సాఫ్ట్‌ సొల్యూషన్స్‌, హ్యూమన్‌ పవర్‌ సర్వీసెస్‌, కాలిబర్‌ బిజిసెస్‌, సపోర్ట్‌ సర్వీసెస్‌, జయభేరి ఆటో మోటివ్స్‌, టీమ్‌ లీజ్‌ ఎనాలిస్‌ ల్యాబ్‌, వసంత్‌ కెమికల్‌, ఎక్సెల్‌ ఇండస్ట్రిస్‌, టీం లీజ్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌, ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో 455 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

18–37 ఏళ్ల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాల బట్టి జీతం నెలకు రూ13,000 నుంచి రూ30,000ల వరకు ఉంటుందన్నారు. అసక్తి గల అభ్యర్ధులు ncs.gov.in వెబ్‌ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఈ నెల 21న ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 200 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లా సబ్‌ రీజినల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి నిట్టాల శ్యామ్‌ సుందర్‌ తెలిపారు. ఇంటర్వ్యూలు జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌, పాత ఐటీఐ బాలికల క్యాంపస్‌లో జరుగుతాయన్నారు.

 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

#Tags