Skip to main content

Job Mela: ఈనెల 16న జాబ్‌మేళా.. వేతనం 17 వేలకు పైగానే, వారు అర్హులు

Job Mela   AP Skill Development Corporation   Job Fair   District Skill Development Officer PB Srinivas

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికా రి పీబీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18–35 ఏళ్ల మధ్య వారు అర్హులని తెలిపారు. విశాఖపట్నంలో పనిచేసేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ అర్హత ఉన్నవారు అర్హులు కాగా, నెల కు వేతనం రూ. 17000 నుంచి రూ. 21000 మధ్య ఉంటుందని పేర్కొన్నారు.

శ్రీకాకుళం, విశాఖపట్నంలో పనిచేసేందుకు అపోలో ఫార్మశీకి 10వ తరగతి, డిగ్రీ, బి.పార్మశీ, డి.ఫార్మశీ, ఎం.పార్మశీ ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని వివరించారు. విద్యార్హత బట్టి వేతనం రూ. 10500 నుంచి రూ. 20,000 ఉంటుందని తెలిపారు.
 

Published date : 15 Mar 2024 05:55PM

Photo Stories